Top 10 Interesting Facts In Telugu

ఈ దేవాలయంలో ఆడవారికి ఇలాంటి పూజలు చేస్తారా టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి. చాలాసార్లు అవి న్యూస్‌లోనూ లేదా ఎవరి ద్వారానో తెలిసినప్పుడు అవునా అనిపిస్తుంది. అలాంటి 10 ఇంట్రెస్టింగ్ ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. బీహార్‌కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్రేష్ సింగ్ పండించిన హాప్ షూట్స్ అనే ఒక రకమైన  కూరగాయ క్యాన్సర్, టీబీ వంటి వ్యాధులను నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇవి మందుల తయారీలో ఉపయోగించడం వలన ఎక్కువ ధర కలిగి ఉన్నాయి.

2. థాయిలాండ్‌కు చెందిన ఒక దొంగ  దొంగతనానికి ఒక ఇంటికి వెళ్ళి ఆహారాన్ని తిని కొంతసేపు పడుకుందాం అనుకున్నాడో ఏమో ఏసీ గదిలోకి వెళ్లి పడుకున్నాడు.  మరుసటి రోజు ఎవరో లేపుతున్నట్టు అనిపించి లేచినప్పుడు అతని ముందు ఉన్నది పోలీసులు. వారు దొంగను  లేపి స్టేషన్‌కు పట్టుకుపోయారు.

3. చైనాలో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురుగా గుర్తించి పెళ్లి కొడుకు తన సొంత కొడుకు కాదని తమ బిడ్డ తప్పిపోయినప్పుడు అనాధ ఆశ్రమం నుండి తెచ్చి పెంచుకున్న కొడుకు కనుక వారిద్దరు పెళ్లి చేసుకోవచ్చని తేల్చారు

4. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంజనీర్ ప్లాస్టిక్‌తో పెట్రోలు తయారుచేసి లోకల్ ఇండస్ట్రీలకు లీటరు 40 రూపాయల చొప్పున అమ్ముతున్నారు

5. చైనా వాళ్ళు 4 ని చూస్తేనే భయపడుతుంటారు. చైనీస్ భాషలో నాలుగుని సి అంటారు. చైనాలో సి అంటే చావు అని ఇంకొక అర్థం ఉంది కనుక వారు 4 ని అశుభంగా భావిస్తారు.

6. ఇండోనేషియాకు చెందిన జోషువా అనే  శవపేటికలు తయారు చేసే వ్యక్తి ఇంట్లో పైనుండి ఏదో పడినట్లు శబ్దం వినిపించి వెళ్లి చూడగా అది మీటియోరైట్.  దాని విలువ మన కరెన్సీలో 11 కోట్లుగా తేలింది. ఎందుకంటే ఇది మన భూమి కంటే పురాతనమైన మెటల్‌గా గుర్తించబడింది. 

7. చిత్రలేఖనం కష్టమైన పని కానీ స్టీఫెన్ విల్ట్సైర్ అనే ఒక వ్యక్తి న్యూయార్క్ సిటీని హెలికాప్టర్ నుండి 20 నిమిషాల పాటు చూసి అచ్చు ఆకాశం నుండి న్యూయార్క్ సిటీని ఫోటో తీసి బ్లాక్ అండ్ వైట్లోకి జిరాక్స్ చేసినట్టు ఉండే చిత్రం వేసాడు.

8. ఈ ప్రపంచంలో ఉన్న మరొక వింతైన వ్యక్తి మ్యాథ్యూ హాగ్. ఆల్కహాల్ తీసుకోకపోయినా ఇతను మత్తులో ఉంటాడు. ఇతని శరీరంలో ఎప్పుడు ఆల్కహాల్ తయారవుతుంది.

9. వెయ్యి సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక రోమన్ వ్యక్తి యొక్క ఆస్తి పంజరంలో పళ్ళు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి. వారు తినే ఆహారంలో షుగర్ తక్కువగా ఉండడం, వారి ఆహారపుటలవాట్లని శాస్త్రవేత్తలు తేల్చారు. 

10. నార్త్ కొరియాలో జీవించే ఒక వ్యక్తి సౌత్ కొరియా వెళ్లిపోవడానికి బోర్డర్ వరకు చేరుకున్నాడు. అయితే అప్పుడే సైన్యం చూసి అతడిపై కాల్పులు జరిపారు. కానీ అతను సౌత్ కొరియా చేరుకునేందుకు బోర్డర్ దాటేశాడు..

11. భారతదేశపు విచిత్రమైన ఆలయమే అస్సాంలోని కామాఖ్య టెంపుల్. ఈ టెంపుల్లో యోని రూపంలో ఉన్న ఒక విగ్రహాన్ని పూజిస్తారు. 

Leave a Comment

error: Content is protected !!