Top 10 Super Herbs to Cleanse Your Kidneys

ఈ కార్న్ సిల్క్ తో వాటర్ చేసుకుని తాగినట్లయితే కిడ్నీ లో రాళ్ళు, కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి

 మనం అందరం ప్రతి సీజన్లో సీజనల్ ఫ్రూట్స్ తింటాము.  కానీ ప్రతి వాటిని కడిగి మాత్రమే తీసుకోవాలి.  కడగకుండా తీసుకోవడం వలన చాలా  అనారోగ్యాలు వస్తాయి.   కాయలు లేదా  పండ్లు తయారవడానికి వాడే కెమికల్స్  కడగకుండా తీసుకోవడం వలన మన శరీరం లోపలికి వెళ్లి అనారోగ్యాలను  తెస్తాయి. కానీ మొక్కజొన్నలను కడగకుండా ధైర్యంగా తినొచ్చు. ఎందుకంటే దీని మీద చాలా పొరలు పొరలుగా ఉంటుంది. మొక్కజొన్నలు పంటకి  వాడే కెమికల్స్ అన్ని పైపొర లోనే ఉంటాయి. లోపలి వరకు రావు కాబట్టి  కడగకుండా తీసుకున్న ఎలాంటి అనారోగ్యాలు రావు.  మొక్కజొన్న తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మొక్కజొన్నలను  ఉడికించి లేదా కాల్చుకొని మాత్రమే తీసుకుంటారు. అలాగే మొక్కజొన్న కండెలకు ఉండే పీచు వల్ల కూడా  చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  కానీ పీచు ని ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని బాగా మరిగించాలి. దానిలో ఒక గుప్పెడు కార్న్  సిల్క్  వేసి పది నిమిషాలపాటు బాగా మరిగించాలి. బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఈ నీటిని వడకట్టి కొని అర చెక్క  నిమ్మరసం కలుపుకుని రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.  ఈ రసం తీసుకోవడం వల్ల కిడ్నీ లో రాళ్ళు  కరిగిపోతాయి. కిడ్ని సంబంధిత సమస్యలు అన్నీ తగ్గుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

కడుపులో ఏమైనా సమస్యలు ఉంటే జీర్ణ సంబంధిత  సమస్యలు తగ్గుతాయి. ఈ కార్న్ సిల్క్ వాటర్ తాగడం వలన రక్త ప్రసరణలో ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.  మనం చెత్తబుట్టలో  పడేసే ఈ పీచులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఔషధ గుణాలు గురించి తెలీక ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.ఎలాంటి మందులు అవసరం లేకుండా ఈ నీళ్లుతో కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.మీరు కూడా ఈ నీటిని తయారు చేసుకుని తాగితే కిడ్నీలో  రాళ్లు, కిడ్నీ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.ఈ ఈజీ చిట్కాతో  ఇంట్లోనే  కిడ్నీ సమస్యలు సైతం ఈజీగా తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!