Top 2 Foods that can Boost your Hemoglobin Naturally

మీ శరీరంలో ఒక చుక్క రక్తం లేకపోయినా పరవాలేదు……. ఒక గ్లాస్ ఇది తాగి చూడండి చాలు……..టన్నుల టన్నుల రక్తం శరీరంలోకి వస్తుంది…

ప్రస్తుత కాలంలో మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లు బట్టి మన శరీరం బలహీన పడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా అనేకమంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటున్నారు. అంతేకాకుండా కొంచెం శ్రమించిన త్వరగా నీరసం, అలసట వచ్చేస్తుంది. దానికి కారణం మనం తీసుకున్న ఆహారంలో పోషకాహార లోపం. వీటికి ఎన్ని మందులు వాడిన తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది గాని శాశ్వత పరిష్కారం ఉండదు. దీనికోసం ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే జ్యూస్ మంచి ఫలితం ఇస్తుంది.  ‌

                        ఇది మనకి ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సింది గోధుమ గడ్డి. గోధుమ గడ్డిని మనము ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. లేదా ఇంటి పెరట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. ముందుగా గోధుమలు కడుక్కొని రెండు రోజులు తడిగుడ్డలో చుట్టి ఉంచితే గోధుమలు మొలకలు వస్తాయి. ఈ మొలకలను ఏదైనా కుండీలో వేసుకొని గోధుమ గడ్డిని పెంచుకోవచ్చు. ఇలా ఇంట్లో పెంచుకోవడం ద్వారా కెమికల్ రహిత గోధుమ గడ్డిని మనకు సహజంగా లభిస్తుంది.

               గోధుమ గడ్డితో జ్యూస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం గోధుమ గడ్డిని తీసుకొని నీటిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గోధుమ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. దీనిలో ఒక చిన్న గ్లాస్ తో నీళ్ళు పోసుకోవాలి. తర్వాత నాలుగు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోగా వచ్చిన మిశ్రమాన్ని ఏదైనా పొడి గుడ్డ సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుగా వచ్చిన జ్యూస్ ఏదైనా ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.

                        ఇలా తయారైన జ్యూస్ ను రోజుకు 80 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా రోజు ఉదయం పూట పరగడుపున తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి విడుదల పొందవచ్చు. అంతేకాకుండా రక్తహీనతతో బాధపడే వాళ్ళు తీసుకుంటే మన శరీరానికి రక్తం పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా గోధుమ గడ్డిని తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కనుక ఈ జ్యూస్ ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి…

Leave a Comment

error: Content is protected !!