Top 5 Best Foods Increases Strength High Protein

ప్రోటీన్ ఎక్కువగా లభించే పంచరత్నాలు లాంటి ఐదు రకాల విత్తనాలు…..

 అనేక కారణాల వల్ల మనకు నీరసం వస్తూ ఉంటుంది. కానీ ఆహార సంబంధంగా నీరసాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడే పంచరత్నాలు అంటే అతి బలమైన ఆహారాలు ఉన్నాయి. అవి మొదటిది అన్నిటికంటే చాలా తక్కువ ఖర్చులో లభించేది పచ్చి కొబ్బరి. 100 గ్రాముల కొబ్బరి తీసుకుంటే 444 శక్తి ఉంటుంది. ఇది తెలివితేటలని, మేధాశక్తి ని పెంచడానికి బ్రెయిన్ కి మంచిగా ఉపయోగపడుతుంది. దీనిలో మంచి కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఈ కొబ్బరి చాలా బలాన్ని ఇస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నవి మంచిది కాదు ఈ రోజుల్లో కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువ, మంచి కొవ్వులు ఎక్కువ పచ్చి కొబ్బరి లో ఉంటాయి.

           అందుకని కొబ్బరి ని తురుముకుని దానిలో తేనె కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రెండవది వేరుశనగ పప్పులు 100 గ్రాముల వేరుశనగ పప్పులు తీసుకుంటే 567 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. దీనిలో 25% ప్రోటీన్ ఉంటుంది. కొవ్వులు 40-45% ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. మంచిగా మాంసకృతులు, కొవ్వులు ఉంటాయి. వీటిని 7-8 గంటల వరకు నానబెట్టుకుని తింటే బలమే బలం. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటాయి. మూడవది ముఖ్యమైన విత్తనం పుచ్చగింజల పప్పు. 100 గ్రాముల పుచ్చ గింజల పప్పు 620 కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది.

              అందుకని జీడిపప్పు కన్నా ఎక్కువ బలం. ఈ పుచ్చ గింజల పప్పులో 34% ప్రోటీన్ ఉంటుంది. మేక మాంసం కోడి మాంసం కంటే దీనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇక నాలుగవది పొద్దుతిరుగుడు పప్పు దీనిని 100 గ్రాములు తీసుకుంటే 575 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పొద్దు తిరుగుడు పప్పులో విటమిన్ E అనేది పుష్కలంగా లభిస్తుంది. ఇది అతి బలమైనది మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అన్సాచ్యురేటెడ్ ఫ్యాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పొద్దు తిరుగుడు పప్పును నానబెట్టుకుని తినాలి. పుచ్చ గింజల పప్పు ని కూడా అలాగే నానబెట్టుకుని తినాలి. ఇక ఐదవ పప్పు గుమ్మడి గింజల పప్పు.

             100 గ్రాముల గుమ్మడి గింజల పప్పు తీసుకుంటే 580-590 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పప్పులో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కూడా ఎక్కువ నానబెట్టుకుని తినాలి. ఈ ఐదు రకాల విత్తనాలు అతి బలాన్ని ఇవ్వడానికి నీరసం రాకుండా చేయడానికి బాగా ఉపయోగపడతాయి.

Leave a Comment

error: Content is protected !!