Top 7 Ayurvedic Remedies To Improve Eyesight

కళ్ళజోడు ఉన్నవారు విసిరి పడేస్తారు డాక్టర్లు సైతం షాక్

శరీరం మొత్తం యవ్వనంగా ఆరోగ్యంగా ఉంటూ, నల్లని పొడవైన జుట్టు, అందమైన మెరిసే చర్మం అన్నీ ఒకే ఒక్క అలవాటుతో ఆరోగ్యంగా మారిపోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఒకే ఒక పదార్థం ఈ అద్భుతాలను చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ పదార్థం మనకు సులభంగా  లభిస్తున్నా, అవగాహన ఉన్నా కూడా మనం నిత్యం ఉపయోగించడంలో అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఆ అద్బుతమైన పదార్థం రాతిఉసిరికాయ. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి శరీరాన్ని ఆరోగ్యంగా చేయడంలోనూ, రోగాలను దూరం చేయడంలోనూ, జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడానికి, చర్మానికి మెరుపునిచ్చి, మొటిమల మచ్చలు లేకుండా చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.

 అయితే దీనిని ఉపయోగించడంలోనే అసలైన విషయం ఉంటుంది. ఉసిరికాయలు దొరికినప్పుడు ఎక్కువగా తినాలి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉసిరికాయలతో చేసిన ఆవకాయ. కానీ ఉసిరి ఆవకాయ తినడం వలన శరీరానికి కావలసిన ఔషధ గుణాలు దొరకవు. నిల్వ చేసిన పచ్చడి వలన లాభాల కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఉసిరిని ఎలా ఆహారంలో తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం దగ్గర పడుతుంటే ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తెచ్చుకొని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడిచి, తరువాత శుభ్రంగా మెత్తగా తురుముకోవాలి. 

ఇలా తురుముకున్న ఉసిరిని ఒక గ్లాసులోకి తీసుకొని అది మునిగేంత వరకు ఒక గ్లాసు మంచినీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు బ్లాక్ సాల్ట్  వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత వడకట్టు సహాయంతో దీనిని వడకట్టుకోవాలి. ఇప్పుడు వడకట్టగా వచ్చిన నీటిని రోజు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆమ్లాలో ఆయుర్వేదవైద్య మరియు ఔషధ లక్షణాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, కాల్షియం,, ప్రోటీన్ మరియు ఫైబర్ ఉన్నాయి. అంతేకాకుండా ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, విటమిన్ బి కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇది కంటి సమస్యలను తగ్గించి కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కంటిచూపును మెరుగు పరుస్తాయి.

ఇక జుట్టు నల్లగా ,ఒత్తుగా పెరగడానికి ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉసిరి ముక్కలని ఒక గ్లాస్ జార్లో వేసుకొని అవి మునిగేలా కొబ్బరి నూనె లేదా మీరు ఉపయోగించే ఏదైనా నూనెను వేసుకోవచ్చు. తరువాత ఒక ఐదు రోజుల పాటు నూనెను ఎండలో ఉంచాలి. తరువాత తలకు అప్లై చేసుకోవచ్చు. ఇలా ఉపయోగించడం వలన జుట్టు రాలడం, చిన్నతనంలోనే జుట్టు తెల్లబడే సమస్య, చుండ్రు వంటివి తగ్గుతాయి. ఇది తలలో పేరుకొన్న చుండ్రును శుభ్రం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. దీనివలన తలలో పుండ్లు , దురద వంటి సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరగే అవకాశం ఉంటుంది. ఈ రెండు చిట్కాలు పాటించడం వలన ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది.

Leave a Comment

error: Content is protected !!