top 9 grains will keep your body strong

బాహుబలిని తలదన్నే అంత శక్తి, బలాన్ని ఇచ్చే నెంబర్ వన్ ఫుడ్

ప్రతి మనిషి చాలా బలంగా ఉండాలని ఆశిస్తాడు. కానీ ఎలాంటి ఆహారం తీసుకున్నా అంత బలంగా ఉండలేరు. రోజుకు 15 నుండి 18 గంటలు పని చేయాలంటే బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి  బలాన్ని ఇచ్చే ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నవరత్నాల  లాంటి నవవిత్తనాలు. వీటిని తీసుకుంటే బాహుబలి అంత బలం వస్తుంది. మనం  బలాన్ని ఇచ్చే ఆహారం అనగానే గుడ్లు, మాంసం అనుకుంటాము.  కాని వాటి కంటే విత్తనాలులోనే ఎక్కువ  బలం ఉంటుంది.

  1. వాల్నట్స్,  100 గ్రాములు తీసుకుంటే 687 క్యాలరీల శక్తి వస్తుంది. ఒక గుడ్డు తీసుకుంటే   72 క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది. గుడ్డు 60 గ్రాముల బరువు ఉంటుంది. దాంట్లో   తెల్లసొన మాత్రమే తీసుకుంటే  17 క్యాలరీల శక్తి వస్తుంది. 100 గ్రాముల కోడిమాంసం తీసుకుంటే 87 కాలరీల శక్తి వస్తుంది. 100 గ్రాముల  మటన్ తీసుకుంటే 117  క్యాలరీల శక్తి వస్తుంది. 
  2. బాదం పప్పు, 100 గ్రాముల బాదం పప్పు తీసుకుంటే 650 కేలరీల శక్తి వస్తుంది.  బాదంపప్పులు బలానికి, జుట్టుకి చాలా మంచిది.
  3. పుచ్చ పప్పు, 100 గ్రాముల   పుచ్చ పప్పు తీసుకుంటే 628 కేలరీల శక్తి వస్తుంది. కోడి మాంసం, మేక మాంసం కంటే  పుచ్చ  పప్పులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. 
  4. పిస్తా పప్పు, 100 గ్రాములు పిస్తాపప్పులో 628 కేలరీల శక్తి ఉంటుంది. 
  5. జీడిపప్పు, 100 గ్రాముల జీడిపప్పులో 598 కేలరీల శక్తి ఉంటుంది. 
  6. గుమ్మడి గింజలు పప్పు, 100 గ్రాముల గుమ్మడి గింజలు పప్పులు 598   క్యాలరీల శక్తి ఉంటుంది. గుమ్మడి గింజలు మెదడుకు శక్తిని పెంచి,    ఇమ్యూనిటీ పవర్ పెంచే శక్తి ఉంటుంది. 
  7. వేరుశనగ పప్పు, 100 గ్రాముల వేరుశనగ పప్పులో  568 క్యాలరీల శక్తి ఉంటుంది.  వేరుశెనగపప్పుని పేదవారి జీడిపప్పుగా వర్ణిస్తారు. 
  8. పొద్దుతిరుగుడు గింజలు, 100 గ్రాముల  పొద్దుతిరుగుడు గింజలు 550 క్యాలరీల శక్తి ఉంటాయి. వీటిలో విటమిన్ E అధికంగా ఉంటుంది. విటమిన్ ఈ యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. 
  9. కొబ్బరి, 100 గ్రాములు కొబ్బరి లో 444 క్యాలరీల శక్తి వస్తుంది.  కొబ్బరి తినడం వలన మేధా శక్తి పెరుగుతుంది. 

ఈ 9 రకాల విత్తనాలను రోజుకి నాలుగైదు రకాల చొప్పున నానబెట్టుకుని తినడం వల్ల మంచి శక్తి వస్తుంది. ఇవన్నీ 0 కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. ఇంధనాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. మాంసాహారానికి ఖర్చుపెట్టే డబ్బులతో వీటిని కొనుక్కుని తరచుగా తినడం వల్ల నాలుగు రెట్లు శక్తి ఎక్కువగా వస్తుంది.

Leave a Comment

error: Content is protected !!