మన ప్రకృతిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చెట్లు చాలా ఉన్నాయి. మనకు శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రయోజనాలు కలిగించడంలో ప్రకృతి ముఖ్యపాత్ర వహిస్తుంది. వాటిలో సింగపూర్ పూలు వీటిని శంఖం పూలు అని కూడా అంటారు. ఈ పువ్వుల యొక్క చెట్టు ఆకులు, కాండం, పువ్వులు ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదంలో ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అనేక రకాలుగా ఉపయోగించబడుతుంది.
ఇప్పుడు మనం ముందుగా ఈ పువ్వులను ఉపయోగించి ముఖం గ్లో గా తయారవడం కోసం ఒక క్రీమ్ ను తయారు చేసుకుందాం. దీనికోసం శంఖం పువ్వులను లేదా సింగపూర్ పువ్వులు తీసుకొని ఒక గాజు సీసాలో వేసుకోవాలి. దీనిలో ఒక గ్లాస్ వేడి నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపటికి పువ్వులు రంగులోకి నీళ్లు కూడా మారతాయి. ఒక గంట తర్వాత పువ్వులు మరియు నీళ్లు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని నీళ్లు తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక బౌల్ తీసుకుని రెండు చెంచాల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలో సింగపూర్ ఫ్లవర్స్ వాటర్ వేసుకుని ఉండలు లేకుండా జారుగ ఉండే విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి. ఈ నీటిలో ముందుగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పెట్టి డబల్ బాయిలర్ పద్దతిలో వేడి చేసుకోవాలి.ఈ మిశ్రమం క్రీములాగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకుని ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి.
దీనికోసం ప్లాంట్ బేస్ అలోవెరా జెల్ లేదా మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా ఉపయోగించవచ్చు. తర్వాత దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్, సింగపూర్ ఫ్లవర్స్ వాటర్తో చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ క్రీం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జిలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జిలో నెల నుండి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ క్రీం ప్రతి రోజు ముఖానికి అప్లై చేసి 5 నిముషాల పాటు మృదువుగా మస్సాజ్ చేసుకోవాలి.
ఈ క్రీం అప్లై చేయడం వలన డార్క్ సర్కిల్స్, నల్లటి మచ్చలు, ముడతలు వంటి సమస్యలు తగ్గి ముఖం గ్లో గా కనిపిస్తుంది. మిగిలిన సింగపూర్ ఫ్లవర్స్ వాటర్ ను స్కిన్ టోనర్ గా ఉపయోగించుకోవచ్చు.