Top Health Benefits of Fasting Telugu

ఉపవాసంలో అద్భుత రహస్యం

మాఘమాసం, కార్తీకం, శివరాత్రి, ఏకాదశి ఇలా చెప్పుకుంటే దేవుడితో పాటు గుర్తొచ్చేవి ఉపవాసాలు.  పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్ళైనవాళ్ళు కుటుంబం సంతోషంగా ఉండాలని ఇలా ఎన్నో అనుకుంటూ ఉపవాసం పేరుతో ఆహారానికి దూరంగా ఉంటారు. అయితే అందరికి తెలియని ఒక విషయం పెద్దలు ఈ ఉపవాసం అనే పద్ధతిని పాటిస్తూ వచ్చినది కేవలం దేవుడి మీద భక్తి తో మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప ఆరోగ్య రహస్యం కూడా ఉంది. అదేంటో చూద్దామా మరి.

ఉపవాసం ఎలా ఉండాలి.

ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయం లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. కొందరు ద్రవాహారం, పండ్లు తీసుకుంటూ ఉండచ్చు అంటారు, మరికొందరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇంకొందరు పాలు, జ్యూస్ లు పరిమితంగా తీసుకుంటూ ఉంటారు. ఎన్నిరకాలుగా చేసినా ఉపవాసంలో ఆరోగ్య రహస్యం మాత్రం చాలా గొప్పది.

◆ మనం ఏదైనా ఇతరులు చెప్పే విషయాన్ని వింటున్నాం, వారికి తిరిగి సమాధానం ఇవ్వగలుగుతున్నాం, ఒక విషయాన్ని ఆలోచించగలుగుతున్నాం అంటే దానికి కారణం మెదడు. అలాంటి మెదడు ఉపవాసం వల్ల ప్రభావితం అవుతుంది. గుండెకు మెదడుకు ఉన్న సంబంధం వల్ల నాడీ కణాల ఉత్పత్తికి సాయపడే ప్రోటీన్లు  ఉపవాస ప్రక్రియ వల్ల ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల మతిమరుపు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు మన దరిదాపుల్లో కూడా రావు.

◆ రోజులో మూడు పూటలా ఆహారం తీసుకున్నా, రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకున్నా మన శరీరంలో జీవక్రియ మాత్రం 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం జీర్ణమవడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. అదే ఉపవాసం వల్ల మనం రోజంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల జీర్ణాశయనికి కాసింత విశ్రాంతి దొరుకుతుంది. దీనివల్ల జీర్ణాశయం గోడలలో ఉన్న సమస్యలు మెల్లిగా పరిష్కరించుకుంటాయి.అంతేకాదు జీర్ణశయంలో ఉన్న వ్యర్థం బయటకు తోయబడుతుంది.

◆ నీళ్లు సరిగ్గా తాగకపోతే మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ అవుతుందని విషయం మీకు తెలిసినదే అయితే అపుడపుడు ఇలా అవ్వడం  వల్ల మన శరీరంలో దాగిన మలినాలు, బాక్టీరియా వంటివి విచ్చిన్నమైపోతాయి. అందుకే కొందరికి ఉపవాసం ఉన్నపుడు జ్వరం వచ్చినట్టు అవుతుంది దీనిలో అంతరార్థం మన శరీరంలో దాగున్న జబ్బు తాలుకు బాక్టీరియా, వైరల్ లు ఈ విధంగా బయటకు వెళ్లిపోతాయి.

◆ ఆరోగ్యకరమైన గుండె ఉంటే ఆరోగ్యకరమైన జీవితం మన సొంతం అంటారు. అలాంటి గుండెకు చెడు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ను విచ్చిన్నం చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది తద్వారా మనం శరీరంలో రక్తం కూడా శుభ్రపడుతుంది. 

◆ మన శరీరంలో మలినాలు బయటకు వెళ్లిపోవడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు మన దరిచేరకుండా యవ్వనంగా ఉండేలా ఉపవాసం తోడ్పడుతుంది.

◆మనం రోజూ ఆహారాన్ని తీసుకోవడం వల్ల దానికి అలవాటు పడిన శరీరానికి ఒక్కపూట ఆహారం దూరమైనా శరీర చర్య అస్తవ్యస్తం అవుతుంది. శరీరాన్ని అన్నిటికీ సమన్వయం చేసుకోగలిగే ప్రక్రియనే ఉపవాసం.

చివరగా…….

పై ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఉపవాసం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది. తద్వారా ఆహారాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. ముఖ్యంగా ఆహారం దొరకని వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం, హేళన చేయడం వంటివి తగ్గి మానవతా విలువలు పెంపొందుతాయి. 

    అయితే ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ చేయడం కూడా ఆరోగ్యాన్ని కబలిస్తుంది. పదిరోజులకు ఒక్కసారి లేక నెలకు రెండు సార్లు ఉపవాసం మంచిది అంతకుమించి చేయడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముఖ్యంగా ఉపవాసానికి  అనారోగ్య సమస్యలు, బలహీనంగా ఉన్నవాళ్లు, గుండెజబ్బు సమస్యలు ఉన్నవాళ్లు, గర్భవతులు దూరంగా ఉండటం మంచిది.

Leave a Comment

error: Content is protected !!