తేనె చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మనకు ఎప్పటి నుంచో తెలుసు. పువ్వుల నుండి తేనెటీగలు తయారు చేసిన తేనె చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పుష్కలంగా కలిగి ఉంది. ఇది రెగ్యులర్ డైట్లో భాగంగా చేసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే తేనె ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా!! ఎవరూ ఊహించని షాకింగ్ విషయాలు ఇవి. ఇన్నాళ్లు తేనె బరువు తగ్గడానికి నేచురల్ స్వీట్నెస్ ఇస్తుందని అనుకున్నవాళ్ళు ఆశ్చర్యపోయే నిజాలు.
తేనె ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం. మరి తేనె ఎక్కువ తీసుకుంటే కలిగే అనర్థాలు ఇవే!! చదివేయండి మరి.
రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది
తేనెలో చక్కెర మరియు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. అది కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాబట్టి తేనె అతిగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, రక్తంలో చక్కెర స్థాయిలలో అసాధారణ పెరుగుదల ప్రమాదకరంగా ఉంటుంది.
తేనె రక్తపోటును తగ్గిస్తుంది
రక్తపోటును నియంత్రించడంలో తేనె గొప్ప పదార్థంగా పరిగణించబడుతుంది. కానీ అధికంగా తీసుకున్నప్పుడు, ఇది మీకు తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ ప్రమాదం కూడా కలిగిస్తుంది. దీర్ఘకాలంలో, ఇది మీ గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది.
కడుపు సమస్యలకు దారితీస్తుంది
మలబద్దకంతో బాధపడుతుంటే, తేనె దాన్ని మరింత దిగజార్చుతుంది. తేనెలోని చక్కెరలను జీర్ణించుకోలేక జీర్ణక్రియ ఇబ్బందికి గురవుతుంది. ఫలితంగా తేనె ఉబ్బరం మరియు విరేచనాలకు దారితీస్తుంది.
బరువు పెరగడానికి దారితీస్తుంది
తేనె బరువు తగ్గించడంలో దోహాధం చేసినప్పటికీ దాన్ని అతిగా తీసుకోవడం వల్ల బరువును గమనిస్తుంటే మీకే అర్థమవుతుంది తీసుకునే తేనె మొత్తాన్ని నియంత్రించడం చాలా అవసరమని. తేనెలో ఉండే కేలరీలు, చక్కెర మరియు కార్బోహైడ్రేట్ల అధిక కంటెంట్ బరువు పెరగడానికి సహాయపడుతుంది.
తేనె దంత సమస్యలను పెంచుతుంది.
ఎక్కువ తేనె తీసుకున్నప్పుడు, అందులో చక్కెర శాతం ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి, ఇది దంత క్షయంను ప్రోత్సహిస్తుంది. తేనెలో 82% చక్కెరలే ఉంటాయి. సాధారణ చక్కెర కాకపోయినా ఇది దంతాలను దెబ్బతీయడానికి కారణమవుతుంది. అంతేకాదు తేనె జిగటగా ఉండటం వల్ల తేనెను అతిగా తీసుకున్నపుడు పళ్లకు అతుక్కోవడం వల్ల దంత సమస్యలు ఎక్కువ అవుతాయి.
చివరగా…..
తేనె ఔషధపరంగా కూడా ఎంతో గొప్పది అయినప్పటికీ, అతిగా తీసుకోవడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలే కాకుండా దాని వల్ల మేలు జరగడం కాకుండా అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. కాబట్టి తేనెతో జాగ్రత్తగా ఉండండి.