top healthy grains for our health

65 ఏళ్ళు వచ్చిన ముసలితనం రాకుండా అలానే యవ్వనంగా ఉండాలంటే..ఒక్కసారి ఇవి తినండి

హలో ఫ్రెండ్స్ ఈరోజుల్లో మన లైఫ్ స్టైల్ కారణంగా ఒళ్లంతా నొప్పులు, అరికాళ్ళలో మంటలు, కొద్ది దూరం నడిచిన ఆయాసం, చిన్న చిన్న పనులకే నీరసం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం పోషకాహార లోపం అని చెప్పవచ్చు. దీనివల్ల  రక్తహీనత క్యాల్షియం లోపం ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు దీనివల్ల ప్రాణవాయువు అన్ని అవయవాలకు సక్రమంగా చేయడం లేదు. తద్వారా చిన్న చిన్న పనులకే అలసటగా మారి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చాలా మంది డయాబెటిస్ హాట్ ప్రాబ్లం ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పబోయే ఫపదార్థాలు తప్పక తినండి.

అవిసె గింజలు

ఈ గింజలు మనకు కావాల్సిన ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ , ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. జుట్టు తో పాటు ఇతర శరీర భాగాలకు కూడా ఎంతో సహాయం చేస్తాయి. ఇందులోని ఫైబర్ మన పెద్ద ప్రేగు పాడవకుండా ఎంతో సహాయం చేస్తుంది అలాగే మన శరీరంలో కొవ్వు ను కరిగిస్తుంది. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. రాత్రి ఒక బౌల్ లో ఒక గ్లాసు నీటిని తీసుకోండి అందులో ఒక స్పూన్ ఈ గింజలను అందులో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ టైం లో వీటిని నమిలి తిని తర్వాత మంచి నీళ్లు తాగండి. ఇలా చేయడం వల్ల ఇందులోని ఫైబర్ మనకు ఎక్కువగా ఆకలి కాకుండా చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆరోగ్యంతో పాటు మన చర్మ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. వీటిని తీసుకోవడం వల్ల కొత్త చర్మ కణాలు కూడా తయారవుతాయి వీటిని మీరు పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇవి మన బ్రెయిన్ షార్ప్ గా ఉండేలా చేస్తాయి.

గసగసాలు

ఈ గసగసాలను మనం వంటల్లో వాడుతూ ఉంటారు. మన పూర్వీకులు వీటిని ఆయుర్వేదంలో ఉపయోగించే వారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. గసగసాలు రాత్రి ఒక స్పూన్ మోతాదులో ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇవి మన శరీరానికి ఎంతో సహాయం చేసి అలాగే కిడ్నీలో రాళ్లు రాకుండా సహాయం చేస్తాయి. ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది పేగులను బాగా కదిలేలా చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు ఈ గసగసాలను ఫ్రై చేసి షుగర్ కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. గసగసాలు తీసుకోవడం వల్ల వేడి తగ్గి చలువ చేస్తుంది. అసిడిటి  కడుపులో మంట కడుపులో ఫుల్లు తగ్గుతాయి. కానీ వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి లేకపోతే సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

తండ్రిలా కాపాడే బాదంపప్పు.

సాధారణంగా మనం పాలను తల్లి లాగా భావిస్తాం. ఈ పాలలో తల్లి లాగా కాపాడే పోషకాలు ఉంటాయి. మరి తండ్రి అంటే అది బాదం పప్పు అని చెప్పాలి. జీవితాంతం ఆరోగ్యవంతమైన పోషించే బాధ్యత తీసుకుంటుంది. ఇవి తరచూ తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి నీటిలో నాలుగు నుంచి ఐదు వాదములు నానబెట్టి ఉదయాన్నే పై తొక్క తీసి పరగడుపున తినేయాలి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

సెనగలు

రాత్రి ఒక గుప్పెడు సెనగలు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో నానబెట్టి తినాలి. ఇలా నానబెట్టిన వాటిలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది వీటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఈ సెనగలలో ఉండే ప్రోటీన్స్ శరీరానికి ఎంతో సహాయం చేస్తాయి ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చేస్తాయి.

మెంతులు

మెంతులు తీసుకోవడం వలన మనకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్ ప్రొటీన్లు మాంగనీస్ మెగ్నీషియం ఖనిజాలు వంటివి పుష్కలంగా ఉంటాయి. తరచూ మెంతులులను  తీసుకుంటే అధిక బరువుతో బాధపడే వారు సులభంగా తగ్గిపోతారు. ఈ మెంతులను ఒక స్పూన్  మోతాదులో  రాత్రంతా నానబెట్టి డయాబెటిస్ ఉన్నవారు అరస్పూను కలోంజి విత్తనాలు కలుపుకొని తీసుకోవాలి. కలోంజీ విత్తనాలు విత్తనాలు మన శరీరంలోని అన్ని భాగాలకు ఎంతో సహాయం చేస్తాయి. ఈ రెండింటినీ నానబెట్టి ఉదయాన్ని వాటిని నమిలి తిని ఆ నీటిని తాగితే శరీరంలోని అన్ని వ్యర్థ  పదార్థాలు తొలగిపోతాయి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

Leave a Comment

error: Content is protected !!