20 దాటకుండానే తెల్లజుట్టు సమస్య మొదలైనవారు దానికి రంగు వేయడానికి లేదా రకరకాల డై లు ఉపయోగించడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే వాటి వలన వచ్చే దుష్ప్రభావాలు జుట్టు రాలే సమస్యను,చుండ్రు వంటి సమస్యలు ఎక్కువ చేస్తాయి. అలాంటి వారు సహజంగా దొరికే కొన్ని పదార్థాలతో చేసుకున్న హెయిర్ ఆయిల్ తెల్ల జుట్టు సమస్యను తగ్గించి కొత్తగా వస్తున్న తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది. ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకొని వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
దాని కోసం మనం తీసుకోవాల్సినది ఒక బీరకాయ. బీరకాయను పైన ఈనెలు లేకుండా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. వీటిని బాగా ఎండలో కనీసం రెండు రోజుల పాటు ఆరనివ్వాలి. ముక్కలు గలగలమనాలి. లేకపోతే నూనె త్వరగా పాడైపోతుంది. ముక్కలను మునిగేంత వరకు కొబ్బరి నూనె వేసుకొని రెండు రోజుల పాటు అలా నానబెట్టి వదిలేయాలి. రెండు రోజుల తర్వాత ఈ నూనెను ముక్కలతో సహా ఐరన్ పెనంలో వేసుకొని నూనె రంగు మారేంత వరకు చిన్నమంటపై మరిగించాలి.
నూనె రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి నూనెను చల్లారనివ్వాలి. చల్లారిన నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి రాత్రంతా ఉంచుకోవాలి. మరుసటిరోజు ఉదయం తలస్నానం చేయొచ్చు. ఇది తెల్లజుట్టును ప్రారంభదశలో నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది.
రిడ్జ్ గార్డ్, తురై, లేదా బీరకాయగా పిలవబడే ఈ మొక్క బూడిదరంగు జుట్టు నివారణలో అత్యంత ప్రభావవంతమైన పదార్ధాలలో ఒకటి.
ఇది వర్ణద్రవ్యాలను పునరుద్ధరించడానికి మరియు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. గరిష్ట ప్రయోజనాల కోసం ఈ నూనెను వారానికి 2-3 సార్లు అప్లై చేయండి. గ్రే హెయిర్ రూట్స్ నుండి నిరోధించే మరియు రివర్స్ చేసే ఉత్తమ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బీరకాయలో ఉండే పోషకాలు జుట్టు సమస్యలు నివారించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.