ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల్లో కూడా కీళ్ల నొప్పులు సమస్య వస్తుంది. అనేక రకాల జాయింట్ల నొప్పులు , కీళ్ళనొప్పులు వలన ఏడుస్తుంటారు. అలాంటి వారికి ఒక సింపుల్ చిట్కా ద్వారా కాళ్ల నొప్పులను తగ్గించవచ్చు. ఇది పురాతన కాలం నుండి ఇంటి నివారణగా ఉపయోగిస్తున్నారు. దీని కోసం మనం ఒక స్పూను బెల్లం తురుము తీసుకోవాలి. దీనిలో అర స్పూన్ పసుపు వేసుకోవాలి. పాన్ లేదా కిల్లీల కోసం ఉపయోగించే సున్నం కూడా ఒక స్పూన్ తీసుకోవాలి.
సున్నం మరియు బెల్లం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలపడం వలన ఇది చిక్కటి మిశ్రమంలా తయారవుతుంది. దీనిలో కావాలనుకుంటే కొన్ని చుక్కల నీటిని వేసి నొప్పి ఉన్నచోట పైపూతగా వేయడానికి కావలసిన మిశ్రమంగా చేసుకోవాలి. తరువాత దీనిని ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ అప్లై చేసి ఒక తమలపాకును దీనిపై పెట్టాలి. తర్వాత ఏదైనా గుడ్డతో కట్టు కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది నొప్పి ఉన్న చోట గట్టిగా తయారై నొప్పిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
ఇది కండరాలు బిగుతుగా ఉండేందుకు సహకరిస్తుంది. బెల్లం పసుపు నొప్పిని తగ్గించడంలో ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహకరిస్తాయి. సున్నం తీసుకోవడం వలన కాల్షియం యొక్క గొప్ప వనరుగా ఉంటుంది. కాల్షియం లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
బెల్లం తీసుకున్నప్పుడు కీళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బెల్లం పొడితో ఒక గ్లాసు పాలను క్రమం తప్పకుండా తాగండి, అది ఎముకలను బలోపేతం చేస్తుంది మరియు ఆర్థరైటిస్ వంటి ఎముక మరియు కీళ్ల పరిస్థితులను నివారిస్తుంది. బెల్లం కీళ్లలో మంటను ఉపశమనం చేస్తుంది మరియు ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. పసుపులోని ఒక పదార్ధం ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారిలో మోకాలి నొప్పిని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. ఉదయాన్నే లేచిన తర్వాత ఈ మిశ్రమాన్ని నీటితో శుభ్రం చేసుకొని గోరువెచ్చని నీటితో కడగడం వలన నొప్పులు తగ్గిపోతాయి ఇలా తరచూ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు