tulsi tree change place its own miracle video

ఈ వింత చూస్తే షాక్ తనంతట తానే తిరుగుతున్న తులసి మొక్క

తులసి మొక్కను భారతదేశంలో అతి పవిత్రమైన మొక్కగా పూజిస్తాం. అలాగే ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చికిత్స నివారణగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అందుకే తులసిని భూమి మీద ఉన్న దేవతగా భావిస్తుంటాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తులసి కల్యాణం కూడా చేస్తూ ఉంటారు. తులసి విష్ణువుకు ప్రీతి పాత్రమైన మొక్క. అయితే తులసిని దేవతగా భావించి పెంచుకునేవారు తులసి మొక్క తమకు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తుందని నమ్ముతారు.  మొక్క ఎండిపోయినా లేదా అపరిపక్వంగా ఎండిపోయినా, రాబోయే చెడు సమయాలకు సూచనగా భావిస్తారు.  

తులసి ఆకులు  ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాటి రంగును మారుస్తాయి.  గ్రహల ప్రభావం మనపై మంచి లేదా చెడు ప్రభావాలను సూచిస్తుందని ఆకుల పచ్చదనాన్ని బట్టి తెలుసుకుంటారు.  మంచిగా ఉన్నప్పుడు, తులసి ఆకులు ప్రకాశవంతమైన ఆకుపచ్చగా ఉంటాయి లేదా పాలిపోయినట్టు వాలి పోతాయని చెబుతారు. ఇలాంటి అద్భుతాలు గురించి మనం చాలానే వింటూ ఉంటాం.

 దేవతా విగ్రహాలు ఆహారం తీసుకుంటున్నాయని, కళ్ళ నుండి రక్తం కారుతుందని, కొంత మంది దేవతల కళ్ళలో నుండి కన్నీళ్ళు కారుతున్నాయి అని, పాదాల నుండి విభూతి రాలుతుందని  కొన్ని విషయాలు బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. అలాంటి ఒక విషయమే తులసి మొక్క గురించి ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకరి ఇంట్లో జామ చెట్టు పక్కనే ఒక చిన్న తులసి మొక్క ఉంది. ఒక రోజు ఉదయం ఆ ఇంటి వారు చూసేసరికి తులసి మొక్క గుండ్రంగా తిరుగుతున్నట్లుగా గమనించారు. 

మొక్క తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నట్లుగా కదులుతూ ఉంది. ఇది చూసి ఇది భగవంతుని లీలగా భావించి ఆ ఇంట్లో మనుషులు ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల వారు ఆ మొక్కను చూడడానికి వచ్చారు. అయితే శాస్త్రవేత్తలు కొన్ని కెమికల్ రియాక్షన్ వల్ల మొక్కలు ఇలా తిరుగుతాయి అని చెప్పారు. అయితే ఇది చూసిన వారు మాత్రం అంతా మంచి జరగడానికి సూచనగా భావించి పూజలు చేశారు.

Leave a Comment

error: Content is protected !!