ప్రియమైన మిత్రులారా .. మన చుట్టూ ఉండే చాలా మొక్కలు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటిలోని ఔషధ గుణాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాము. అలాంటి వాటిలో ముఖ్యమైనది ఈ తుమ్మి మొక్క. ఈరోజు మనం తుమ్మి మొక్క గురించి తెలుసుకుందాం. దీన్ని తుమ్మి మొక్క లేదా తుమ్మ చెట్టు అనికూడా అంటారు. ఈ మొక్క వల్ల ఎన్నో ఔషధ ఉపయోగాలు ఉన్నాయి.
వర్షాకాలంలో ఈ మొక్కలు బాగా చిగురిస్తాయి. ఈ మొక్కల ఆకులను కూరగా వండుకొని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఎక్కువ శాతం మందికి తెలియక దీన్ని పిచ్చి మొక్క అనుకొంటారు. వీటిని కూరలా వండుకుని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పక్షవాత వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలంటే వీటి ఆకులను కూరగా వండుకొని తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తేలు కుట్టినప్పుడు తుమ్మి ఆకుల రసాన్ని కుట్టిన ప్రదేశంలో వేసి ఆకులు కూడా ఆ ప్రదేశంలో వేసి కట్టుకడితే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాదు ఆరసాన్ని ఒక రెండు స్పూన్ల మోతాదులో తేలుకుట్టిన వ్యక్తికి తాగించడం ద్వారా ఆవిష ప్రభావం లేకుండా ఉంటుంది.
ఆడవారికి రుతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం అవుతుంటే ఈ తుమ్మి ఆకులను పేస్టులాగా నూరి అందులో కొద్దిగా నిమ్మరసాన్ని నువ్వుల నూనెను కలిపి ప్రతిరోజు పరగడుపున తింటే అధిక రక్తస్రావం తగ్గి పోతుంది. పాము కరిచిన చోట ఈ ఆకుల రసాన్ని వేసి కరిచిన చోట ఆకుల రసాన్ని పోసి విష ప్రభావాన్ని తగ్గించే వారని మన పూర్వీకులు చెబుతున్నారు.
ఒక స్పూన్ మోతాదులో ఉదయం సాయంత్రం తుమ్మ ఆకుల రసాన్ని తాగితే ఎంతటి తీవ్రమైన జ్వరమైన తగ్గుముఖం పడుతుంది. గజ్జి తామర వంటి రోగాలకు తుమ్మి ఆకు పై పూతగా పూస్తే తగ్గుముఖం పడతాయి. వాపు మంట నొప్పి ఉన్న ప్రదేశాల్లో ఈ ఆకుల రసాన్ని ఉపయోగించవచ్చు. ఈ ఆకులతో కాచిన కషాయాన్ని కొద్దిసేపు నోట్లో ఉంచుకుని పుక్కలించి ఉసేయడం ద్వారా నోటిపూత తగ్గిపోతుంది.
ఈ ఆకులను కూరగా వండుకొని తింటే అజీర్తి సమస్యలను దూరం చేసి ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. తుమ్మి ఆకులను కూరగా వండుకొని తింటే మన శరీరంలో ఉండే విషపదార్థాలు బయటికి పంపి మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తాజా తుమ్మి ఆకుల రసాన్ని రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే సైనసైటిస్ తగ్గుతుందని మన పెద్దలు చెబుతున్నారు. ఆస్తమా జలుబు దగ్గు వీటికి ఈ తొమ్మిది ఆకుల రసాన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే అవి మన దరిచేరవు. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మా పేజీని లైక్ చేయడం మర్చిపోకండి.