తలలో తెల్ల జుట్టు కొత్తగా మొలుస్తున్నాయా. హెన్నాతో నల్లజుట్టుగా మార్చుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. దానికోసం హెన్న పౌడర్ ను మిక్స్ చేసుకోవాలి. దానికోసం టీ పౌడర్ లేదా కాఫీ పౌడర్ తో డికాక్షన్ తయారు చేసుకోవాలి. కాఫీ లేదా టీ పౌడర్ నీటిలో వేసి బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు హెన్నా పౌడర్ తీసుకొని అందులో డికాక్షన్ వేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ బాదం ఆయిల్ ఏదో ఒకటి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ఐరన్ పాన్లో పెట్టుకొని దాని పైన కవర్ తో చుట్టి పెట్టుకోవాలి. దీని వల్ల హెన్నాలో ఆక్సిడైజ్ జరుగుతుంది. ఈ హెన్నా పైన బ్లాక్ కలర్ లోకి మారుతుంది. అప్పుడు దీన్ని తలకు అప్లై చేసుకొని ఆరిన తరువాత షాంపు లేకుండా నీళ్లతో మాత్రమే తలస్నానం చేయాలి.
ఇలా తరుచూ చేయడం వలన తలలో తెల్ల వెంట్రుకలు ఎరుపు రంగులోకి మారుతాయి. అంతే కాకుండా ఇలా ఎన్నో అప్లై చేయడం వల్ల జుట్టుకు మంచి కండిషన్ అందుతుంది. సైనస్ ఉన్నవాళ్ళు , జలుబు ఉన్న వాళ్ళు హెన్నా అప్లై చేయకూడదు. చలికాలంలో అప్లై చేస్తే కనీసం గంటలోపులో శుభ్రం చేసుకోవాలి.
తర్వాత ఇండిగో పౌడర్ కలుపుకొని దాన్ని తలకు అప్లై చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత 30 నిమిషాల లోపల శుభ్రం చేసుకోవాలి. ఇది ఎర్రగా మారిన జుట్టును నల్లగా మారుతుంది. ఇలా కనీసం నెలకొకసారి వేసుకున్నా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీంట్లో ఎటువంటి అమ్మోనియా లేదా కెమికల్స్ ఉండవు కనుక జుట్టు రాలే సమస్య కూడా ఉండదు.
దీని కోసం మంచి బ్రాండ్ హెన్నా మరియు ఇండిగో పౌడర్ వాడాలి. హెన్న పౌడర్ కలుపుకోవడానికి బృంగ్రాజ్ పౌడర్ లేదా ఆమ్లా పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఈ హెన్నా పౌడర్ తలలో చుండ్రు జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు జుట్టు మంచి కండిషన్లో ఉండేలా కూడా చేస్తుంది. హెన్నా తలలోని చర్మాన్ని ఆరోగ్యంగా చేయడంతో పాటు తలలోని వేడిని తగ్గిస్తుంది.