ugadi 2022 importance in telugu

ఉగాది లోపు గుమ్మానికి రహస్యం గా ఇది కడితే కొత్త సంవత్సరంలో అదృష్టం, ఐశ్వర్యం

ఉగాది పండుగ అంటే తెలుగువారికి చాలా ప్రత్యేకమైనది. ఉగాది తెలుగు నెలలు మొదలయ్యే మొదటిరోజు. తెలుగు సంవత్సరాది రోజున షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తప్పకుండా తింటుంటారు. అలాగే ప్రతి ఇంటికి మామిడాకుల తోరణాలు కట్టి, కొత్త బట్టలు ధరించి, పిండివంటలతో చాలా బాగా చేసుకుంటారు. ఈ ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది అది సోమకేశుడు అనే రాక్షసుడు దానవ వంశాన్ని అత్యంత ఉన్నతమైనదిగా స్థాపించాలనుకున్నాడు.  అందువల్ల, అతను మానవ తరగతి పురోగతికి అంతరాయం కలిగించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.  విష్ణువు నాలుగు వేదాలను బ్రహ్మకు అప్పగించాడని తెలుసుకున్న తరువాత, పవిత్ర గ్రంథాలు మానవులకు చేరకుండా ఆపడానికి వాటిని దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ రాక్షసుడు బ్రహ్మలోకం నుండి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం దొంగిలించడంలో విజయం సాధించాడు.  వాటిని తీసుకొని సముద్రం లోపల దాచాడు. అందువలన, వేదాలను అతని బారి నుండి విడిపించడానికి, విష్ణువు చేపగా మారి అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇస్తాడు. అందుకే రోజుని ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఈ రోజున పంచాంగ శ్రవణం వినడంతో పాటు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో రాశి ఫలాలు ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఇంటి ముందు ఇప్పుడు చెప్పబోయే ఒకటి కట్టడం వలన చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. ఒకప్పుడు ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు కడుక్కొని వెళ్లేవారు. కానీ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్ వలన కాళ్లు కడుక్కోవడం కుదరని పని.

 అందుకే ఇంటి ముందు ఇది కట్టడం వలన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకోవచ్చు. దీని కోసం మనం ఒక ఎర్రని గుడ్డ తీసుకొని ఒక కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమతో స్వస్తిక్ ఆకారాన్ని వేయాలి. తరువాత ఈ కొబ్బరికాయను ఎర్రగుడ్డలో పెట్టి 5 పసుపుకొమ్ములు, కొన్ని అక్షింతలు వేసి మూట కట్టాలి. ఇంటి ముందు కట్టడం వలన ఎటువంటి చెడుశక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2వ తారీఖున జరుపుకోవాలి. చైత్ర శుక్ల బాధ్రపదం నాడు ఉగాది జరుపుకుంటారు మరియు ఆ రోజు సూర్యోదయం సమయంలో ప్రతిపద తిథి తప్పనిసరిగా ప్రబలంగా ఉంటుంది.  ప్రతిపాద తిథి ఉదయం 11:53 గంటలకు ప్రారంభమవుతుంది.

ప్రతిపాద తిథి ముగుస్తుంది: ఏప్రిల్ 02, 2022 11:58 AM. వరకూ

Leave a Comment

error: Content is protected !!