ummetha kayalu benefits

మంచం మీద ఉన్న వారినైనా నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

ఉమ్మెత్త కాయలను ప్రతి ఒక్కరూ బాల్యంలో దువ్వెన కాయలుగా ఉపయోగించి ఆడుకోవడం గుర్తుండే ఉంటుంది. అలాగే ఉమ్మెత్త ఆకులను స్కూల్ లో ఉండే బ్లాక్ బోర్డులకు నలుపు రంగు రావడానికి ఉపయోగించేవారు. అయితే ఉమ్మెత్త ఇలా సరదాకే కాకుండా ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వలన మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ వంటివి తగ్గించుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ఆయుర్వేద చికిత్స నివారణ వైద్యాలలో  ఉమ్మెత్త ప్రధాన పాత్ర పోషిస్తుంది. నొప్పులు తగ్గించుకోవడానికి ఉమ్మెత్త కాయలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఉమ్మెత్త కాయలను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి దీని పైన ఉండే తొడిమను విడదీయాలి. తరువాత ఉమ్మెత్త కాయలోని తొడిమ లోపలి భాగాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్పై ఒక మందపాటి గిన్నెలో ఒక 200 గ్రాముల ఆవ నూనె వేసుకోవాలి. దీనిలో తొడిమ తీసేసిన ఉమ్మెత్త కాయలను వేసుకొని ఇవి బాగా వేగిపోయేంతవరకు నూనెను మరిగించాలి. తర్వాత ఈ నూనెను వడకట్టి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ ఈ నూనెను నెమ్మదిగా ఆ ప్రదేశంలో మసాజ్ చేయాలి. తరువాత ఒక కాటన్ క్లాత్తో కట్టు కట్టాలి. ఇలా కొన్ని రోజులపాటు చేయడం  వలన కొన్ని రోజుల్లోనే నొప్పులు తగ్గిపోతాయి. ఉమ్మెత్తలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులు, నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 

అలాగే ఆవనూనెలో కూడా వేడి చేసే గుణం ఉంటుంది.  ఇది నొప్పులను తగ్గించి వాపులను నివారించడంలో సహకరిస్తుంది. ఉమ్మెత్త కాయలను కాల్చిన తర్వాత ఆ నూనెను అప్లై చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చేదు నార్కోటిక్ మొక్క నొప్పిని తగ్గిస్తుంది మరియు ఔషధ లక్షణాలు  వైద్యం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది.  మొక్క యొక్క విత్తనాలు ఔషధపరంగా అత్యంత చురుకైనవి.  బాహ్యంగా, ఈ మొక్క ఫిస్టులాస్, గడ్డలు గాయాలు మరియు తీవ్రమైన న్యూరల్జియా చికిత్సలో పైపూతగా ఉపయోగించబడుతుంది. ఉమ్మెత్త యొక్క అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఆస్తమా నుండి ఉపశమనం, జ్వరాన్ని తగ్గించడం, గుండెను రక్షించడం, నొప్పిని తొలగించడం, సంతానోత్పత్తిని పెంచడం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచడం, ఆరోగ్యకరమైన నిద్రను కలిగించడం మరియు ప్రసవాన్ని సులభతరం చేయడం వంటి వాటి సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు.

Leave a Comment

error: Content is protected !!