వేసవిని పసందుగా మార్చే మామిడి, పుచ్చకాయ వంటి వాటితో జతకట్టి అందరిని సేదతీర్చే మరొక పండు తాటి పండు. ఈ తాటిపండులో లభించే తాటి ముంజలు చల్లగా తియ్యగా అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. వేసవిలో విరివిగా లభించే ఈ తాటి ముంజలు తీసుకోవద్సమ్ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గూర్చి తెలుసుకోవలసిందే.
◆ తాటి ముంజలు సహజంగా శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. వేడి చేసినపుడు తినడం వల్ల వేడి తగ్గుతుంది మరియు వేసవి నెలల్లో విరివిగా లభిస్తుంది. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో 93% నీటి శాతం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది..
◆నోటి రీహైడ్రేషన్ ద్రావణాన్ని తయారు చేయడానికి తాటి ముంజలు అద్భుతమైన ప్రత్యామ్నాయం, ఇవి శరీర కణాలలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహణకు ఉపయోగిస్తారు. వాంతులు మరియు విరేచనాలతో బాధపడుతున్న వారికి ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం ఎలా దోహాధం చేస్తుందో తాటి ముంజలుతో చేసే జ్యుస్ కూడా అదే విధంగా పనిచేస్తుంది.
◆ ఆర్థరైటిస్ కలిగించే అసౌకర్యం గూర్చి అందరికి తెలిసినదే. ప్రతిరోజు తాటి ముంజలు తీసుకోవడం వల్ల నెమ్మదిగా ఆర్థరైటిస్ ను నయం చేస్తుంది. ఆర్థరైటిస్ కు ఉపయోగించే మందులు సమర్థవంతంగా పనిచేయడంలో కూడా ఇది దోహాధం చేస్తుంది.
◆తాటి ముంజల్లో ఉండే చక్కెర గ్లైసెమిక్ స్థాయి తక్కువగా ఉన్నందున, ఇది కృత్రిమ చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం, ఇది మధుమేహం రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.
◆ తాటి పండ్లలో చాలా ఫైబర్ ఉంటుంది. కాబట్టి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్య ఉన్నపుడు రోజుకు 5 నుండి 10 తాటి ముంజలు తినడం ద్వారా మలబద్దకం మరియు జీర్ణ సమస్యలు సులువుగా అధిగమించవచ్చు.
◆తాటి చక్కెర అధిక పోషక విలువలతో తయారవుతుంది సాధారణ చక్కెర కంటే తాటి చక్కెర తీసుకోవడం వల్ల పిల్లలలో అభివృద్ధి మరియు పెరుగుదలను ప్రోత్సహించడానికి అనుకూలంగా ఉంటుంది.
◆సాధారణంగా ఆయుర్వేదంలో తాటి చక్కెర చికిత్సాపరంగా విలువైనది మరియు మూలికా ఔషధాలను తయారు చేయడానికి చాలా ముఖ్యమైనది. తాటి చక్కెరతో ఉత్పత్తి చేయబడిన మూలికా మందులు టైఫాయిడ్, చెడు శ్వాస, జలుబు, రక్తహీనత, దగ్గు, అధిక రక్తపోటు, కుష్టు వ్యాధి మరియు ఉబ్బసం చికిత్సకు ఉపయోగిస్తారు.
చివరగా…..
ఆరోగ్యం కోసం తాటి ముంజలు తినాలని అంజకున్నపుడు ఎల్లప్పుడూ తాజా, శుభ్రమైన పండ్లను ఎంచుకొని, ఒక రోజులో తేలికగా తినేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే తాజాగా ఉన్నవాటిలోనే మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి.