unknown benefits of banayan tree ravi chettu

రావి చెట్టులో రహాస్యం…… తెలిస్తే ఆశ్చర్యపోతారు.

హిందూ సంప్రదాయం లో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బుద్ధుడికి ఈ చెట్టు కింద జ్ఞానోదయమైనందువల్ల బౌద్ధ మతస్తులు కూడా రావి చెట్టును పవిత్రంగా చూస్తారు. బోధి వృక్షం కేవలం దైవ  స్వరూపంగానే కాదు  అద్భుతమైన ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. అవి ఆరోగ్య సమస్యలను ఆమడ దూరం తరిమేస్తాయి. ఇంతకు రావి చెట్టులో ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో చూద్దామా??

ఆకలి పెరగడానికి

విత్తనంబు మర్రి వృక్షంబు అని చిన్ననాడు పద్యాలు చెప్పుకున్నాం. మర్రిచెట్టు కాయల్లాగే రావి చెట్టు కూడా కాయలు చిన్నగా ఉంటాయి.  అలాంటి చిన్నటి రావి పండ్లు బాగా మాగినవి తీసుకుని శుభ్రం చేసుకుని తినాలి. దీనివల్ల ఆకలి లేక ఆహారం తగ్గించిన వాళ్లకు ఆకలి పెరుగుతుంది.

పాము కాటుకు

పల్లె ప్రాంతాల్లో వాళ్లకు, వ్యవసాయంలో ఎక్కువ లీనమైపోయిన వాళ్లకు పాముల బెడద ఎక్కువ. పాము కాటు వేసినప్పుడు రావి చెట్టు ఆకులు రసం తీసి మూడు నుండి నాలుగు స్పూన్లు తాగించాలి. దీనివల్ల విష ప్రభావం నెమ్మదిస్తుంది. ఈలోపు వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాణ నష్టం జరగకుండా కాపాడవచ్చు.

Bodhi – Banyan – Raavi Chettu

మధుమేహం

మధుమేహం ను షుగర్ అంటారని తెల్సు కదా. షుగర్ ను కంట్రోల్ పెట్టడానికి రావి ఆకులు మంచి ఔషధంగా పని చేస్తాయి. రావి ఆకులను ఎండించి పొడి చేసి నీటిలో వేసి తరువాత ఆ నీటిని వడపోసి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం చాలా తొందరగా కంట్రోల్ లోకి వస్తుంది.

రక్తం గడ్డకట్టని సమస్య ఉన్నవాళ్ళకు

కొంతమందికి గాయం అయితే రక్తం కారిపోతూనే ఉంటుంది. రక్తాన్ని గడ్డ కట్టించే ఎంజైములు మన శరీరంలో లేకపోవడం వల్ల జరిగే సమస్య అది. అయితే గాయం తగిలినపుడు వాడటానికి అనువుగా ధనియాలు, పటిక, చెక్కర,రావి ఆకులు సమానంగా తీసుకుని గుజ్జులా కలిపి రోజుకు రెండు నుండి మూడు సార్లు తీసుకోవాలి. దీనివల్ల ఆగకుండా కారుతున్న రక్తం గడ్డకట్టి నిలిచిపోతుంది.

గర్భసమస్యలకు

రావి పండ్లను సేకరించుకుని ఎండించి, దంచి పొడి చేసుకోవాలి. దీనిని పంచదారతో కలిపి ఆవుపాలలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల గర్భ సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా గర్భం దరించినవారికి గర్భస్రావం జరగకుండా కాపాడుతుంది.

కాలిన పుండ్లకు

రావి చెట్టు బెరడును ఎండించి చూర్ణం చేసి శరీరం పై కాలిన పుండ్లపై చల్లాలి దీనివల్ల కాలిన పుండ్లు తొందరగా మానిపోతాయి. 

వాంతులకు

ఎండిన రావి చెట్టును కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదను రెండు గ్రాముల మోతాదుగా నీటిలో కలిపి వడగట్టి తాగాలి.  ఇలా చేయడం వల్ల ఎలాంటి వాంతులైనా తగ్గిపోతాయి.

చివరగా….

మన చుట్టూ ఉన్న రావి చెట్టులో ఇన్ని అద్భుతమైన ఔషధాలు ఉన్నపుడు వాటిని ఆచరిస్తూ అలాగే  చెట్లను కాపాడుకుంటూ ప్రకృతి సిద్ధంగా ఆరోగ్యాన్ని  కాపాడుకుంటే వందేళ్లు మీసొంతం.

Leave a Comment

error: Content is protected !!