unknown benefits of moong dal mung beans

పెసలతో ఇంత ఆరోగ్యం చేకూరుతుందని మీకు తెలుసా??

ప్రతి దైవ కార్యంలో తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టేవాటిలో వడపప్పు తప్పక ఉంటుంది. పెసరపప్పునే వడపప్పు అంటాము.  సాధారణంగా పెసరపప్పు పాయసంగా, నానబెట్టిన పెసరపప్పును కీరా, పచ్చి కొబ్బరి ఉప్పు, కారం వేసి సలాడ్ లాగా తీసుకుంటూ ఉంటాం. పెసరపప్పు చలువ చేసి ఒంట్లో ఉన్న వేడిని తరిమి కొడుతుంది. అయితే పెసరపప్పు కంటే పెసలు ను అందరూ ఎక్కువగా వాడుతుంటారు. మనం శ్రేష్ఠమైనవి గా చెప్పుకునే నవధాన్యాల్లో పెసలు కూడా ఒకటి. వందల సంవత్సరాల పూర్వం నుండే వాడుతున్న ఈ పెసలను ఉపయోగించి రకరకాల వంటకాలు చేసుకుంటూ అద్భుతః అనుకుంటూ తింటుంటాము.  అయితే పెసలు కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని ఇస్తాయని మన పెద్దలు చెబుతుంటారు.

అసలు పెసలు వాడటం వల్ల కలిగే బోలెడు ప్రయోజనాలు ఏంటి?? అవి మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి ఇపుడు తెల్సుకుందాం.

◆పెసల్లో విటమిన్-ఎ,  విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-ఈ, మాంగనీస్ తో పాటు ఖనిజ లవణాలు, కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు ముఖ్యంగా పీచు అదికంగా ఉంటాయి.

◆పెసలను ఏ విధంగా తీసుకున్నా అందులో నుండి మనకు బోలెడు పోషకాలు అందుతాయి. అయితే చాల మంది పెసలను మొలకలుగా తీసుకుంటారు.  మొలకెత్తిగా పెసల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతే కాదు మొలకల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. చాలా మందిలో జుట్టు రాలిపోవడం అనేది విటమిన్-ఎ లోపం వల్ల కూడా జరగవచ్చు. ముఖ్యంగా విటమిన్ ఎ లోపం వల్ల చర్మం పొడి బారడం, జీవం లేనట్టు తయారు కావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాంటి వారు మొలకెత్తిన పెసలు తీసుకోవడం వల్ల చాలామంచి  పలితం ఉంటుంది. అంతే కాదు మొలకెత్తిన పెసలు డైటింగ్ చేసే వారికి ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఉన్న ఫైబర్ కడుపు నిండుగా ఉన్న భావనను ఎక్కువసేపు ఉంచుతుంది ఫలితంగా బరువు తగ్గడానికి మంచి సహాయకారి మొలకెత్తిన పెసలు.

Sprouts – Moong Dal

◆పెసలు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒకప్పటి కాలంలో సోప్ లకు బదులుగా సున్ని పిండిని వాడేవారు. ఆ సున్ని పిండి తయారీలో పెసలు తప్పక వాడేవారు. పెసలు వల్ల చర్మానికి మృదుత్వం వస్తుంది. కాంతి వంతం అవుతుంది, ఆరోగ్యంగా తయారవుతుంది. ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి పూర్వపు రూపం సంతరించుకుంటుంది. చర్మం మీద ఉన్న మచ్చలు, మొటిమలు, గాయాల తాలూకూ గుర్తులు అన్ని మెల్లిగా మాయమైపోతాయి.

◆పెసలు బిపి ని నియంత్రిస్తుంది, అంతే కాకుండా మంచి కొవ్వులు పెంపొందడానికి  సహకరిస్తూ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అందువల్ల పెసలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ.

◆మహిళల్లో కనిపించే అనిమియా కు పెసలు మంచి పరిష్కారం. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల అనిమియా రాకుండా చేస్తుంది. అలాగే యాంటీ  క్యాన్సర్ కారకాలుగా పని చేసి క్యాన్సర్ కు దూరంగా ఉంచుతుంది.

◆హరోన్ల అసమతుల్యను నివారించి తలనొప్పి, నీరసం కండరాల నొప్పి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.

చివరగా…..

పెసలు ఏ విధంగా తీసుకున్న ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి పెసలను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోండి మరి. 

Leave a Comment

error: Content is protected !!