కొలెస్ట్రాల్ అంటే…..
కొలెస్ట్రాల్ అంటే కొవ్వు. మనం తీసుకునే ఆహారం ఎలాగైనా సరే అది ఏ రూపంలో ఉన్న శరీరంలో నిల్వ అయ్యే నూనె పదార్థాలను కొలెస్ట్రాల్ గా పిలుస్తారు. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా మన శరీరంలో చేరుతుంది.
◆మొదటిది మనం తీసుకునే పాలు, ఆహారపదార్థాల నుండి లభించేవి.
◆రెండవది మాంసాహారం ద్వారా లభించేది.
కొలెస్ట్రాల్ మన శరీరంలో అన్ని పోషకాల్లాగే అవసరమైనది. అయితే అవసరానికి మించి కొలెస్ట్రాల్ మన శరీరంలోకి చేరితే గుండెజబ్బులు, రక్తనాళ వ్యాధులకు కారణం అవుతుంది. ముఖ్యంగా సముద్రపు జంతువులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ అధికమొత్తం లో శరీరంలోకి చేరుతుంది. అంతేకాకుండా నూనెను కలిగిన వేరుశనగ, కుసుమ పువ్వుల విత్తనాలు, నుండి తయారయ్యే రోజువారీ ఉపయోగించే నూనెల్లో కూడా కొలెస్ట్రాల్ లభిస్తుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది??
ఎక్కువగా నూనె పదార్థాలు, మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇలా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలోని రక్తనాళాల గోడలలో ఈ అధికమైన కొవ్వు పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ రక్తనాళాలను పూడ్చివేస్తుంది. దీనివలన రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇలా కొవ్వు పేరుకుపోయిన రక్తనాళాల్లో పుండ్లు ఏర్పడి రక్తప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఇలా రక్తప్రవాహానికి ఆటంకం కలగడం వల్ల మాన్ శరీరంలో ప్రధాన భాగమైన గుండెకు రక్త సరఫరా జరగక గుండెపోటు సంభవించి ప్రాణాపాయం కలుగుతుంది.
సంతృప్త కొవ్వులు
మనం తీసుకునే ఆహారంలో జ్ఞాతు సంబంధమైన ఆహారం ద్వారా లభించే కొవ్వులు సంతృప్త కొవ్వులు. వీటి వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.గొడ్డు మాంసం, పంది మాంసం, మీగడ తొలగించని పాలు, జున్ను మొదలగు ఆహార పదార్థాలలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి.
కొలెస్ట్రాల్ అధికమైతే ఎదురయ్యే సమస్యలు
కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకునే వారికి రక్తంలో కొలెస్ట్రాల్ హెచ్చుగా ఉన్నవారికి లావు, బరువు అధికంగా ఉన్నవారికి, రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి, గుండె జబ్బులు ఉన్నవారికి, ధూమపానం అధికంగా చేసేవారికి రక్తనాళాలు గట్టిపడి ప్రమాద పరిస్థితులు కలుగుతాయి.
జాగ్రత్తలు.
◆శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
◆సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, ఏ ఆహారంలో ఎక్కువగా ఉంటాయో వాటిని దూరంగా ఉంచాలి. తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలను భాగం చేసుకోవాలి. ప్రత్తి, పొద్దు తిరుగుడు నూనె, సోయా నునే వాడటం మంచిది. అలాగే గానుగ ద్వారా తీసిన వేరుశనగ, నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. వెన్న, నెయ్యి వంటి వాటిని చాలా మితంగా తీసుకోవాలి.
◆మాంసహరానికి అలవాటు పడ్డవారు కోడి మాంసం, కొవ్వు తక్కువగా ఉన్న చేపలు తీసుకుంటూ గొడ్డు మాంసం, పంది మాంసం తీసుకోవడం మానేయాలి.
◆పాలపై మీగడ తొలగించి ఉపయోగించుకోవాలి.
◆శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం తీసుకునే ఆహారంలో కేలరీలు గమనించుకుంటూ శరీర బడువు పెరగకుండా జాగ్రత్త పడాలి.
◆క్రమబద్ధమైన వ్యాయామం, నడక, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
చివరగా…..
కొలెస్ట్రాల్ అనేది మన శరీరానికి ఎంత అవసరమైనదో అది పెరగడం వల్ల మన శరీరం అంత తొందరగా అనారోగ్యాల పాలవుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.