unknown facts about Cow Tail Hair

ఆవు తోకలో నుండి ఒక్క వెంట్రుకతో ఇలా చేస్తే మీ జీవితం మారడం కాయం

హిందూ సాంప్రదాయంలో ఆవును పవిత్రంగా భావిస్తాం. అలాగే ఆవు ఇంటి దగ్గరికి వస్తే ఏమి పెట్టకుండా పంపించం. అయితే ఆవుని ఎలా పూజిస్తే మనకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడైనా ఆవు  కనిపిస్తే ఆవుకు అరటిపండు లేదా ఏమన్నా పండ్లు పెడుతూ ఉంటాం. అలాగే ఆవుకు పసుపు కుంకుమ పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఈసారి అలా వచ్చినప్పుడు ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసుకోవడం మర్చిపోకండి. ఈ వెంట్రుకను కుడి చేతి బొటన వేలుకి చుట్టుకుని శరీరంలో ఎక్కడయితే నొప్పిగా ఉందో అక్కడ ఆ వేలితో నొక్కడం వలన నొప్పులు తగ్గిపోతాయని చెబుతారు.

 అలాగే ఒక రోజులో తగ్గకపోతే రెండు, మూడు రోజులు ఇలా ఆ వెంట్రుకతో నొక్కడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనం ఎవరైనా స్వాములు, ఆధ్యాత్మికవేత్తలు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విసినకర్ర లాంటి దానితో వెన్ను పై నిమురుతారు. ఆ విసనకర్రలో తెల్లని వెంట్రుకలు ఉంటాయి. అవేంటని మనం ఎప్పుడూ ఆలోచించం. అయితే అవి ఆవు తోకలోని వెంట్రుకలు. ఆ వెంట్రుకలలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు ఆవు వెంట్రుకను కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఒక కాగితంలో కట్టి మెడలో వేసుకుంటే వారికి జీవితంలో దిష్టి తగలదు అని చెబుతారు. 

మన వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో ఆవుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆవును అమ్మ స్థానంలో పూజిస్తారు. అలాగే ఆవు తోక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. ఆవు కొమ్ములు నుండి పాదాల వరకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అమ్మ మరణం ఎవరికైనా తీరని లోటు. అలా ఎవరికైనా అమ్మ లేని వారు అమ్మని చూడాలనిపిస్తే ఆవుని చూడటం వలన అమ్మను చూసిన పుణ్యం లభిస్తుందట. ఆవు పాలు తీసుకోవడం వలన అమ్మ చేసిన ప్రసాదం తీసుకున్నట్లు అని చెబుతారు. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అమ్మకు నమస్కరించినట్లేనని చెబుతారు. అయితే ఈసారి ఆవు కనిపిస్తే ఆవు వెంట్రుకలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అలాగే ఆవు కనిపించినప్పుడు అలా పంపకుండా ఆహారం ఇవ్వడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!