దాల్చిన చెక్క ప్రతి వంటగదిలో కనిపించే మసాలా దినుసు. దాల్చిన చెక్కని కేవలం బిర్యానీలో వేసుకొని మసాలా దినుసు అని చాలామందికి తెలుసు. నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని కొంతమందికే తెలుసు. ఇది సౌందర్యాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. వంటకాలకు రుచి సువాసన ఇవ్వటమే కాక ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క చాలా బాగా పని చేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక స్పూను తేనె కొంచెం నిమ్మరసం పిండి ప్రతి రోజు క్రమం తప్పకుండా పరగడుపున తాగితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడమే కాకుండా సన్నగా నాజూగ్గా తయారవుతారు.
మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు దాల్చిన చెక్కను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని నుదిటి పైన మర్దనా చేస్తే చక్కటి ఉపశమనం కలుగుతుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అవి ఫ్రీరాడికల్స్ ను తొలగించడం కాకుండా రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం వస్తాయి. గొంతు బొంగురు పోయినప్పుడు దాల్చిన చెక్క ను బుగ్గన పెట్టుకొని దాని రసాన్ని కొంచెంకొంచెంగా మింగుతూ ఉంటే గొంతు గరగర దగ్గు తగ్గిపోతాయి.
విష కీటకాలు కుట్టినప్పుడు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి కుట్టిన చోట పై పూతగా పూస్తే విష ప్రభావం తగ్గుతుంది. దాల్చిన చెక్కను నీటిలో మరిగించి చల్లార్చి ఆ నీటితో పుక్కలిస్తే నోటిలో పేరుకుపోయిన హానికరమైన బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా చిగుళ్ళు గట్టిపడతాయి.

స్త్రీల గర్భాశయ సమస్యలను తొలగించడంలో దాల్చిన చెక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు దాల్చిన చెక్క పొడిని పాలలో తగు మోతాదులో కలిపి తీసుకుంటే సుఖప్రసవం జరుగుతుంది. జీర్ణాశయ క్యాన్సర్ లను అరికట్ట గలిగే శక్తి దాల్చిన చెక్క కు ఉందని ఇటీవల పరిశోధకులు తేల్చారు. కడుపు ఉబ్బరం అజీర్తి ఇబ్బంది పెడుతున్నప్పుడు దాల్చిన చెక్క లేక పొడి నీటిలో కలిపి తాగిన చక్కటి ఉపశమనం కలుగుతుంది.
మగవారు పడుకునే ముందు దాల్చిన చెక్క పొడిని నీటిలో కలుపుకొని తాగితే వీర్య వృద్ధి అవడమే కాక లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. తెలుసుకున్నారుగా దాల్చిన చెక్క లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో కావున ఏదోరకంగా దీనిని మీ ఆహారంలో భాగంగా అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా జీవించండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి ఇ షేర్ చేయడం మర్చిపోకండి.