మనం నిత్యం ఉపయోగించే పసుపు అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుందని మీకు తెలుసా? ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి మన భారతీయుల పైన పెద్దగా ప్రభావం చూపకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి మనం పసుపుని ఆహారంలో చేర్చుకోని తినడమే అని చెప్పవచ్చు. మన శరీరం వైరస్ ల బారిన పడకుండా పసుపు సమర్థవంతంగా కాపాడుతుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి పసుపులో యాంటీబయటిక్ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు క్యాన్సర్ కణాలను నిర్మూలించే గొప్ప లక్షణం ఉంది.
జలుబు పడిశం ఇబ్బంది పెడుతున్నప్పుడు వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి దుప్పటి కప్పుకొని ఆవిరి పడితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వేడిపాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు దగ్గు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మన దరికి చేరవు అంతేకాక మన శరీరం వైరస్ ల బారిన పడకుండా ఉంటుంది.

వేపాకు పసుపు కలిపి నూరి ఆ పేస్ట్ ను గజ్జి తామర వంటి చర్మ వ్యాధుల ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పసుపు ఉప్పు బాగా కలిపి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే దంతాలపై చేరిన హానికారక బ్యాక్టీరియా చనిపోవడమే కాక పిప్పి పన్ను నొప్పి తగ్గిపోతుంది.
కాళ్ళ పగుళ్ళు ఉన్నప్పుడు వేపాకు మరియు పసుపు మరిగించి ఆ నీటితో కాళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.
మధుమేహం ఉన్న వారికి పసుపు మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
పసుపు గాయాలను నయం చేసే శక్తి ఉంది. గాయం తగలగానే ఆ ప్రదేశంలో పసుపు పెడితే గాయం త్వరగా తగ్గిపోతుంది. పసుపులోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాల బారినుండి త్వరగా కోలుకునేలా సహాయపడతాయి.
మొటిమలు ఉన్నచోట జామాకులు పసుపు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం రాస్తూ ఉంటే మొటిమలు తగ్గిపోతాయి. పసుపు సున్ని పిండి కలిపి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం నిగనిగలాడాలంటే కాకుండా ఎటువంటి చర్మ వ్యాధులు మన దరికి చేరవు.
తెలుసుకున్నారుగా పసుపు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈ పోస్టు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మర్చిపోకండి.