అవాంచిత రోమాలు అనేది శరీరం లేదా ముఖంపై అధిక జుట్టు పెరుగుదల. మహిళలకు, పురుషులు తరచుగా కూడా ఇలా జుట్టు పెరగవచ్చు, కానీ మహిళలలో అనేక ఇతర కారణాలు ఉంటాయి. ఇందులో పై పెదవి, గడ్డం, ఛాతీ మరియు వీపుపై పెరుగుతాయి. ఇది ఆండ్రోజెన్ అని పిలువబడే మగ హార్మోన్లు అధికం అవడం వల్ల వస్తుంది. మహిళలు సహజంగా ఆండ్రోజెన్లను చిన్న మొత్తంలో ఉత్పత్తి చేస్తారు. కానీ ఈ హార్మోన్ యొక్క అధిక స్థాయిలు హిర్సుటిజం(అవాంచిత రోమాల)కు దారితీయవచ్చు.
హిర్సుటిజమ్‌కు కారణమేమిటి?
- హిర్సుటిజం కుటుంబంలో ఉంటే కూడా సంభవించవచ్చు:
- పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS). మహిళల్లో హిర్సుటిజం యొక్క అత్యంత సాధారణ కారణం ఇది. ఇది హార్మోన్ సమస్యలను కలిగించే రుగ్మత.
- పిట్యూటరీ గ్రంధి, అడ్రినల్ గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంధి యొక్క లోపాలు
- అదనపు ఆండ్రోజెన్‌లను తయారుచేసే అండాశయం మీద కణితి
- తీవ్రమైన ఇన్సులిన్ నిరోధకత
- మెనోపాజ్ నుండి హార్మోన్లలో మార్పులు
- అనాబాలిక్ స్టెరాయిడ్స్ లేదా కార్టికోస్టెరాయిడ్స్ వాడకం
- ఎండోమెట్రియోసిస్ చికిత్సకు ఔషధ వినియోగం
అయితే ఈ అవాంఛితరోమాలు స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి వ్యాక్సింగ్, త్రెడింగ్ వంటివి ఉపయోగించినా మళ్ళీ కొన్ని రోజుల్లోనే సమస్య తిరగబెడుతుంది. శాశ్వతంగా నివారించడానికి సహజంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించవచ్చు. దాని కోసం మనం ఒక గిన్నెలో రెండు స్పూన్ల పంచదార వేసి కొద్దిగా నీటిని వేయాలి. పంచదార బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో ఒక పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒకటిన్నర చెంచా మైదా వేసుకోవాలి.
ఇప్పుడు వీటిని బాగా కలిపి కొద్దిగా నీటిని వేసి స్టవ్పై పెట్టాలి. మంట సిమ్లో పెట్టి దగ్గరికి అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. మీకు ఎక్కడ అవాంచిత రోమాలు ఉన్నాయో అక్కడ ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరనివ్వాలి. ఇది బాగా ఆరిన తరువాత కింది నుండి పైకి తీయాలి. ఇలా చేయడం వల్ల అవాంచిత రోమాలు రాలిపోతాయి. అలాగే ఇందులో వేసిన పదార్థాల వలన వాటి కుదుళ్ళు బలహీనపడి కొన్ని రోజుల్లో అవాంచిత రోమాలు శాశ్వతంగా తొలగించబడతాయి.