సాధారణంగా స్త్రీలలో పెదవులపై గడ్డపైన అవాంఛిత రోమాలు వస్తూ ఉంటాయి. కొంతమందిలో వంశపారంపర్యంగా, కొంతమందిలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వలన కూడా వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి త్రెడ్డింగ్, వ్యాక్సింగ్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజులకు మళ్లీ అవాంఛితరోమాలు పెరిగిపోతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి లేజర్ ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు. దీనివలన కూడా కొంతమందిలో తిరిగి అవాంఛిత రోమాలు పెరుగుతున్నట్లు చెబుతారు. కానీ ఒక ఒక ఇంటి చిట్కా ద్వారా ఇలా అవాంచిత రోమాలు పెరగకుండా అడ్డుకోవచ్చు.
దాని కోసం మనం ఒక గిన్నెలో ఒక స్పూన్ పేస్ట్ తీసుకోవాలి. తెల్లని పేస్ట్ ఏదైనా సరే వాడుకోవచ్చు. ఒక స్పూన్ పేస్ట్ గిన్నెలో వేసుకొని దానిలో ఒక ఒక అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తరువాత ఈ రెండు బాగా కలిసేలా కలపాలి. నిమ్మరసం కలపడం వలన ఈ మిశ్రమం పొంగుతుంది. తర్వాత దీనిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నాయో వాటిని షేవింగ్ ద్వారా తీసేసి తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వలన కొన్ని రోజుల్లోనే అవాంఛితరోమాలు పూర్తిగా నిర్మూలించబడతాయి.
కొంతమంది రోమాలు ఉండగా వాటిపై అప్లై చేయడం వలన వెంట్రుకలు రాలిపోతాయి అని చెబుతారు. కానీ దాని వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. షేవింగ్ చేసిన తర్వాత అప్లై చేయడం వలన ఈ మిశ్రమం హెయిర్ ఫాలికల్స్‌ను బలహీనం చేసి తిరిగి పెరగకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే పేస్టు, నిమ్మరసం, బేకింగ్ సోడా కూడా చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి చర్మాన్ని నల్లగా కాకుండా అడ్డుకుంటాయి. నిమ్మరసం హెయిర్ తొలగించిన చోట ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా అడ్డుకుంటుంది. తిరిగి అవాంఛితరోమాలు పెరగకుండా బేకింగ్ సోడా అక్కడ ఉండి వెంట్రుకల కణజాలాన్ని నివారిస్తాయి. శాస్త్రీయ ఆధారాల ప్రకారం బేకింగ్ సోడా ఒక రకమైన ఉప్పు. ఇది చిన్న రాపిడి స్ఫటికాలను కలిగి ఉంటుంది.
మానవ జుట్టు సున్నితమైనది. కాబట్టి, ఈ స్ఫటికాలు జుట్టుతో కలిసినప్పుడు, అవి దాని ఫైబర్లను పాడుచేయవచ్చు. ఇది జుట్టు చివర్లు విచ్ఛిన్నం మరియు చీలికకు దారితీస్తుంది. బేకింగ్ సోడాలో pH 9 ఉంటుంది. అది ఆల్కలీన్గా మారుతుంది. హెయిర్ షాఫ్ట్స్ pH 3.67. దాని ఆల్కలీన్ pH కారణంగా, సోడియం బైకార్బోనేట్ జుట్టు ఫైబర్ యొక్క ఉపరితలం యొక్క ప్రతికూల విద్యుత్ చార్జ్‌ను పెంచుతుంది. ఫలితంగా, ఇది ఆ ఫైబర్ల మధ్య ఘర్షణను పెంచుతుంది, అందువల్ల విచ్ఛిన్నాలకు దారితీస్తుంది. హెయిర్ ఫైబర్‌కు నష్టం వాటిల్లినప్పుడు వాటి మూలాల్లోని ఫైబర్లను బలహీనపరిచి జుట్టు పెరుగుదలను ఆపుతుంది. తరచూ ఈ చిట్కా ఉపయోగిస్తూ అవాంఛిత రోమాలను సులభంగా తగ్గించుకోవచ్చు.