Urine Infection Home Remedies

యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది

ప్రస్తుతం అందరూ  కూడా చాలా ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నాం. రోజు ఉరుకులు పరుగులు  రెస్ట్ తీసుకుందాం అంటే ఆ  టైంలో ఈ పని  అయిపోతుంది కదా అనేసి రెస్ట్ తీసుకోము.  కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం వలన ఏదైనా పని ఆగిపోతుంది ఏమో అని భయం. దీనివల్ల మనం అనేక అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాము. బాడీ వీక్ అయిపోతుంది ఇలాంటి బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.

కప్పుల మీద కప్పులు  కాఫీలు, టీలు,  జంక్  ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్  ఎక్కువగా తింటున్నారు. వీటి వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యలు  రావడానికి గల అలవాట్లను మార్చుకోలేము.  అలా అని లైఫ్  స్టైల్ కూడా  మార్చుకోలేము. ఆహార అలవాట్లను మార్చుకున్నట్లయితే చాలా  సమస్యలను తగ్గించుకోవచ్చు. రోజు ధనియాలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ధనియాలు తినడం వలన  దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గుతాయి.

అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా కాపాడుతుంది.  శరీరంలో ఇమ్యునిటీ పవర్ ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.  రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఈ డ్రింక్  తయారు చేసుకోడానికి  కావాల్సిన రెండో పదార్థం సోంపు. సోంపు  రోజు భోజనం చేసిన తర్వాత తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భారతదేశం లో  సోంపు ఎక్కువగా ఉపయోగిస్తారు.

సోంపు తినడం వలన అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గుతాయి. రోజు ధనియాలు, సోంపు, పటిక బెల్లం కలిపి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని  రెండు స్పూన్లు ధనియాలు, రెండు స్పూన్లు సోంపు వేసుకొని కొంచం వేయించుకోవాలి. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోవచ్చు. రోజు ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. 
అలాగే వీటిని టీ చేసుకొని తాగడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గిన్నె పెట్టి గ్లాసు నీళ్ళు వేసుకొని, రెండు చెంచాల సోంపు, రెండు చెంచాల ధనియాలు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగడం వలన దగ్గు, జలుబు, దగ్గు వల్ల వచ్చే ఆయాసం తగ్గుతాయి.  ఊపిరితిత్తులకు పట్టిన   తగ్గుతుంది. రోజు ధనియాలను,  సోంపు ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు అన్నీ తగ్గుతాయి. ధనియాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి.

Leave a Comment

error: Content is protected !!