మూత్రంలో వాసన వస్తుంది అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా శరీరంలోని అనారోగ్యాన్ని లేదా ఆహారపుటలవాట్ల గురించి మనకు చెప్పే సూచనగా భావించాలి. చాలా మందికి కొన్ని ఆహారాలు అసలు పడవు. అది మనం సరిగ్గా గమనించక తీసుకుంటున్నప్పుడు మన శరీరంలో దానికి సంబంధించిన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. అప్పుడు మూత్రం వాసన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలా వాసన రావడానికి కారణం అయ్యే ఆహారాలు ఆకుకూరలు. పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటివి కొంతమంది శరీరానికి సరిపడనప్పుడు వారు తీసుకుంటే వారి మూత్రం వాసన వస్తుంది.
అలాంటి వారు ఆ రోజు ఏం తిన్నారో గమనించడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక రెండవ సమస్య డీ హైడ్రేషన్. ఎక్కువగా నీటిని తాగడం అలవాటు లేనివారు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. శరీరానికి సరిపడా నీటిని తాగడం పోవడం వల్ల మూత్రం చాలా వాసన వస్తూ ఉంటుంది. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు పెదవులు పగలడం, ముఖంపై చర్మం పాలిపోయినట్లు అయిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మూత్రం వాసనతో పాటు ఈ సమస్యలు ఉన్నప్పుడు డీహైడ్రేషన్ గా గుర్తించి శరీరానికి సరిపడా నీటిని తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇక ఎక్కువగా మూత్రంలో వాసన రావడానికి కారణం మూత్రనాళ ఇన్ఫెక్షన్. మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఏర్పడడం వలన కూడా మూత్రం వాసనతో పాటు మరియు రంగు మారడం కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. తరచూ మూత్రం రావడం, మూత్రంలో మంట, నొప్పి ఏర్పడతాయి. ఈ సమస్య ఎక్కువగా డయాబెటిస్ ఉన్న వారిలో కనిపిస్తుంది. ఈ సూచనలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు వాడటం వలన సమస్య తీవ్రతరం కాకుండా కాపాడుకోవచ్చు. ఈ సమస్యని సహజంగా తగ్గించుకోవడానికి బార్లీ నీళ్లు తాగడం, కొబ్బరి నీరు తాగడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటివి పాటించడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు.
ఇక స్త్రీలలో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా మూత్రం వాసన రావడానికి కారణం అవ్వచ్చు. సెక్స్ తర్వాత యోని గోడలపై బాక్టీరియా పెరిగి దురద, మంట వస్తుంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా గుర్తించి దానికి కోర్సు వాడాల్సి ఉంటుంది. సమస్యను గుర్తించడంతో పాటు వాటికి పరిష్కారాలను కూడా అమలుపరచాలి. దాని వల్ల ఈ సమస్య తీవ్రతరం కావడం అడ్డుకోవచ్చు మరియు అనేక అనారోగ్య సమస్యలను ప్రారంభదశలోనే ఆపవచ్చు. దీని కోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటూ నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజులో కనీసం ఒక గంట వ్యాయామానికి కేటాయించాలి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.