ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి బయటికి వెళ్లి వస్తే మన హెయిర్ చాలా రఫ్ గా తయారవుతుంది. అంతేకాకుండా పొల్యూషన్ కారణంగా చుండ్రు ఎక్కువైపోతుంది. ఈ సమస్య నుంచి విడుదల పొందడానికి మనం తయారు చేసుకునే రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జుట్టు ఊడే సమస్య నుంచి కూడా విడుదల అందిస్తుంది. దీనికోసం ఉపయోగించేవి అన్ని ఇంట్లో ఉపయోగించేవి కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.
ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో మనం నేర్చుకుందాం. దీని కోసం మనం ఏదైనా బయెటిక్ షాంపూ లేదా మైల్డ్ షాంపును ఉపయోగించవలసి ఉంటుంది. ఇది ఎక్కువ ఖరీదు అని మనం భయపడుతూ ఉంటాము కానీ మామూలు షాంపుల్లాగానే ఇది కూడా ఉంటుంది. అయితే వీటిని ఉపయోగించడం వలన మన జుట్టుకు హాని కలగదు. కనుక ప్రతి ఒక్కరు బయెటిక్ లేదా మైల్డ్ షాపును ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మన జుట్టుకు సరిపడినంత షాంపూ వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో సగం చెక్క నిమ్మరసం వేసుకోవాల్సి ఉంటుంది. నిమ్మరసం వేసుకోవడం వలన ఇందులో ఉండే విటమిన్ సి ప్రభావం వలన చుండ్రు తొలగించబడుతుంది. అంతేకాకుండా హెయిర్ కి మంచి గ్రోత్ ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మనం ఉపయోగించే ఏదైనా కాఫీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కాఫీ పౌడర్ మన జుట్టుకు మరియు చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మన జుట్టుకు నాచురల్ కలర్ లాగా పని చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ప్యూర్ వాటర్ ని కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. దీనికోసం ముందుగా మన జుట్టుకు ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మన హెయిర్ మాయిశ్చరైజర్ గా ఉంటుంది. తర్వాత రోజు ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంతో కుదుళ్ల నుంచి చిగుళ్ళు వరకు నీటుగా తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం ద్వారా మన జుట్టు స్మూత్ గా అవుతుంది. మరియు చుండ్రు నుంచి విడుదల పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు చాలా హెల్దీగా ఉంటుంది. జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. కనుక జుట్టు మంచిగా పెరుగుతుంది…