use this home remedy for immunity boosting

మీ శరీరంలో ఇమ్మ్యూనిటి పెంచి క*రోన వైరస్ ను తరిమికొట్టే అద్భుతమైన remedy..immunity boosting drink

 అందర్నీ వణికిస్తున్న క*రోనా మహమ్మారి ఎదుర్కోవాలి అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒకటే మార్గం. చికిత్స కంటే నివారణే మేలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం క*రోనా విషయంలో కూడా అంతే క*రోనా బారినపడకుండా ఉండడమే దీనికి నివారణ. ఒకవేళ వైరస్ బారిన పడినా దానిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి మన శరీరంలో పెంచుకోవడం మరీ ముఖ్యం. ఈ రోగ నివారణ కోసం ఆయుర్వేదంలో అనేక వైద్య చికిత్సలు ఉన్నాయి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య ఆయుర్వేద, యునాని ,సిద్ధ , హోమియోపతి ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా చెబుతుంది. ఆయుష్ నిర్ధారించిన ఒక కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

 ఈ కషాయాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు. మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి. ఇద్దరి కోసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్  చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది మన శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది  నాలుగు లవంగాలు తీసుకొని లవంగాలను కూడా ఇందులో ఆడ్ చేయండి. లవంగాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. రెండు యాలకులు చీల్చుకొని నీటిలో వేసుకోవాలి. 

యాలకులలో గొంతు నొప్పి నివారించే అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఒక ఎనిమిది మిరియాలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. వీటిని పొడి కొట్టి వేసుకోవడం మంచిది. మిరియాల వలన వికారం తలనొప్పి తగ్గుముఖం పడతాయి ఇందులోనే ఒక బిర్యాని ఆకు కూడా వేసుకోవాలి. తురిమిన బెల్లం రెండు చెంచాలు వేసుకోవాలి. ఒకటి లేదా రెండు చిన్న బెల్లం గడ్డలను ఇందులో ఆడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు తాటి బెల్లం, నల్లబెల్లంని వాడుకోండి.. మీ ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపురంగు బెల్లం, పంచదార వాడుకోవడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు బెల్లానికి బదులు నల్ల ఉప్పు వాడుకోవాలి. అలాగే పావు చెంచా అల్లం తురుము కూడా వేసుకోవాలి. అల్లం వికారం, వాంతులు నుండి ఉపశమనం అందించడంతోపాటు తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.

 జీర్ణశక్తిని పెంచి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిస్తుంది పచ్చి పసుపు కొమ్ము అందుబాటులో ఉంటే అది పావు చెంచా తురుము వేసుకోవాలి. అది లేని వారు ఇంట్లో ఉండే పసుపుని వాడుకోవచ్చు. పసుపులోని కర్క్యుమిన్ ఎలాంటి అనారోగ్యంతోనైనా పోరాడుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండడంతో రోగనిరోధకశక్తిని పెంపొందింపజేస్తుంది. ఆ తర్వాత వేసుకోవాల్సింది.  ఒక పది తులసి ఆకులు కూడా వేసుకోవాలి. జీర్ణ శక్తిని పెంచడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతుంటే ఇందులో పావు స్పూన్ వాము కూడా వేసుకోవచ్చు. జలుబు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ నీటిని కొంచెం ఆవిరి పట్టే గిన్నెలో వేసుకుంటే జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి.

 పది నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. గోరువెచ్చగా మారేంతవరకు ఆగి నీటిని వడకట్టుకోవాలి. ఈ నీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరం బలంగా తయారవుతుంది. వచ్చినా ఈ క*రోనాతో పోరాడే శక్తిని ఇస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండటం గ్యారెంటీ. సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వకండి. సంవత్సరంపైన పిల్లలకు చెంచా చొప్పున రోజుకు నాలుగు సార్లు ఇవ్వండి. పెద్దవారు అయితే రోజుకు ఒక గ్లాసు ఉదయం సాయంత్రం తాగవచ్చు. ఇబ్బంది ఎక్కువగా ఉంటే మూడు సార్లు తాగినా పర్వాలేదు

Leave a Comment

error: Content is protected !!