టిప్.1: మనం ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నప్పుడు గాజు సీసాల్లో లేదా డబ్బాల్లో వేసేటప్పుడు పక్కన ఒలికి పోతూ ఉంటాయి. అలా ఒలికి పోకుండా ఉండాలంటే పెద్ద థమ్స్ అప్ బాటిల్ ఎదర భాగం కట్ చేసి డబ్బాలలో పప్పులు లేదా బియ్యం కింద ఒలకకుండా ఈజీగా వేసుకోవచ్చు. గరాటా లాగా ఉపయోగించి నూనెను కూడా వేసుకోవచ్చు.
టిప్ 2: ఇంట్లో పిల్లలు టేబుల్ మీద పెన్నులు, స్కేల్స్, ఎరేజర్, షార్పెనేర్, పిన్స్ వంటివి పడేస్తూ ఉంటారు. వాటన్నిటిని ఒక స్టాండ్ లో పెడతాము. కాకపోతే మనకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు తీసుకోవాల్సి వచ్చినపుడు వెతకడం లేదా మొత్తం వంపి తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్న వాటర్ బాటిల్ ను కట్ చేసి కప్ లాగా చేసి పెడితే అందులో వేసుకోవడం, తీయడం ఈజీగా ఉ ఉంటుంది.
టిప్ 3: బాత్రూంలో డోర్స్, గోడలు, టైల్స్ ఎక్కువ కాలం వాడడం వల్ల గోడలపై నీళ్లు పడటం వలన మచ్చలు మచ్చలుగా వచ్చి ఉండి పోతూ ఉంటాయి. వాటిని ఎన్ని క్లీనింగ్ ఎప్పుడు వేసినా సరే ఆ మచ్చలు పోవు. అలాంటి మచ్చలు పోగొట్టడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా ఒక నిమ్మచెక్క తీసుకొని బేకింగ్ సోడా లో నిమ్మచెక్క అది డోర్ లేదా గోడలను ఒకసారి నిమ్మచెక్క బేకింగ్ సోడా తో రుద్ది తర్వాత స్టీల్ పీచుతో నెమ్మదిగా రుద్దడం వలన మొత్తం క్లీన్ ఐపోతుంది.
టిప్ 4: మనం తరచూ టైల్స్ క్లీన్ చేస్తూ ఉంటాము. కానీ కార్నర్స్ క్లీన్ చేయడం కుదరక అలా వదిలేస్తాము. అవి దుమ్ము పట్టేసి నల్లగా అయిపోతాయి. వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని దానిలో ఏదైనా షాంపూ వేసి బాగా కలిపి క్లోత్ ముంచి తుడవాలి. తర్వాత వేరే క్లోత్ తడిపి మళ్ళీ ఒకసారి తుడవాలి. ఇలా చేసినట్లయితే కార్నర్స్ తెల్లగా గోడ ఏ రంగులో ఉందో అదే రంగులోకి వచ్చేస్తుంది. ఈ షాంపూ వాటర్ తోనే తలుపులు కూడా క్లీన్ చేసుకోవచ్చు.
టిప్ 5: వెండి సామాన్లు తెల్లగా రావాలంటే ముగ్గులో కొంచెం సర్ఫ్ కలిపి వెండి సామాన్లు తోమినట్లయితే తెల్లగా మెరిసిపోతాయి. స్క్రబ్బర్ కూడా అవసరం లేదు చేతితో తోముకుంటే సరిపోతుంది.
ఈ చిట్కాలు అవసరం అయితే మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది.