Uses of coconut husk powder for hair

ఒక్కసారి ఇలా చేస్తే చాలు భయంకరమైన పైల్స్, మొలలు అయినా మాయం, తెల్ల జుట్టు పోయి నల్ల జుట్టు వస్తుంది

    ప్రతి ఒక్కరు కొబ్బరికాయను రకరకాలుగా ఉపయోగిస్తారు. దేవుడికి సమర్పించడానికి, వంటలలో కూడా ఎక్కువగా వాడతారు.  కొబ్బరిలో చాలా    పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు   తీసుకోవడం  వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. డీహైడ్రేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ఒంట్లో వేడి, యురిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. కొబ్బరికాయలు కాకుండా కొబ్బరిపీచు లో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరిపీచులో కూడా చాలా పోషకాలు ఉంటాయి. కొబ్బరిపీచు ఉపయోగించి ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రక్త మొలలు, బాహ్యమొలలు, పార్శ్వ మొలలు తగ్గుతాయి. 

ఈ రెమెడీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి పీచు తీసుకుని బాండీలో వేసి రాజేసుకుని మొత్తం కాలి బూడిద అయ్యేలా ఏదైనా గరిటెతో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ బూడిదని జల్లించి ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. మొలలు వ్యాధితో బాధపడేవారు ఈ బూడిదని పాలలో ఒక స్పూన్ కలుపుకుని రోజూ తాగడం వలన మొలల వ్యాధి తగ్గుతుంది. ఈ చిట్కా అద్భుతంగా పని చేస్తుంది. మొలల వల్ల వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.  మొలల వ్యాధి కాకుండా అందానికి కూడా బాగా పనిచేస్తుంది. ఈ బూడిద, కొంచెం తేనె, కొంచెం పెరుగు   కలుపుకుని ముఖానికి   ప్యాక్ లాగా అప్లై చేసుకొని  ఆరిన తరువాత కడిగేయాలి.

 దీని వల్ల మొహం వచ్చే మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి.  ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.  కొంచెం ఈ బూడిద తీసుకొని దానిలో అలోవెరా జెల్ కలిపి తలకు పట్టించి బాగా  ఆరిన తర్వాత  తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన తెల్ల జుట్టు నల్లగా వస్తుంది. బయటికి వెళ్ళే పని లేక పోతే ఒక రోజంతా  అలా ఉంచేస్తే ఫలితం బాగుంటుంది. కొబ్బరిపీచు పొడిలో  మీ తలకు కావలసినంత నువ్వుల నూనె  తీసుకొని, ఒక స్పూన్ కొబ్బరి పీచు పొడి కలుపుకొని తలకు రాసుకోవాలి. ఎక్కడికి వెళ్లే పని లేకపోతే ఒక రోజంతా  ఉంచుకోవచ్చు. 

లేదంటే ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి చేయడం వల్ల తెల్ల జుట్టు పోయి నల్ల జుట్టు వస్తుంది. కొబ్బరి పీచు వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన మొక్కలు కోసం  కోకో బ్రిక్స్ కొంటూ ఉంటాము. కానీ మనకు అవసరమైనప్పుడు మొక్కల కోసం బ్రిక్స్  ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.  కొబ్బరి పీచు చిన్న ముక్కలుగా కట్  చేసి మెత్తటి పొడి లా గ్రైండ్ చేసుకోవాలి.  ఈ పొడిలో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఉండగా  చేసుకుంటే కోకో బ్రిక్స్ తయారైపోతాయి. 

కోకో బ్రిక్స్ మొక్కలు వేసేటప్పుడు కుండీలు అడుగు భాగాన లేక పైభాగంలో  వేయడం వలన మొక్కలు ఎక్కువ నీటిని పీల్చుకుని మొక్కలు బాగా పెరిగేలా చేస్తాయి. కొబ్బరిపీచు బ్రిక్స్ లాగానే కాకుండా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు.  కొబ్బరి పీచు లో ఉండే పోషకాలు వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

Leave a Comment

error: Content is protected !!