ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మొక్కలు ఉన్నాయ్. వాటిలో కలుపు మొక్కల్లా అనిపిస్తూ ఆరోగ్యాన్ని చేకూర్చే మొక్కలు బోలెడు. అలాంటి జాబితాలో చెందినదే ఉత్తరేణి మొక్క. కుష్ఠురోగం, ఉబ్బసం, ఫిస్టులా, పైల్స్, ఆర్థరైటిస్, గాయం, కీటకాలు మరియు పాము కాటు, మూత్రపిండాలు మరియు గుండె సమస్యలు మూత్రపిండాలలో రాళ్లు, మధుమేహం, వంటి వివిధ వ్యాధుల చికిత్సకు ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉత్తరేణి మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాదు చర్మ సమస్యలు, స్త్రీ జననేంద్రియ సమస్యలు, గోనేరియా, మలేరియా, న్యుమోనియా, జ్వరం, దగ్గు, పైరోయా, విరేచనాలు, రాబిస్, హిస్టీరియా, పంటి నొప్పి మొదలైనవెన్నో ఈ ఉత్తరేణి వల్ల తగ్గుతాయంటే ఆశ్చర్యమేస్తుంది.
ఈ ఉత్తరేణి మొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూడండి. రోజు మనకొచ్చే సమస్యల్లో చాలా బాగా పనిచేస్తుంది.
వికారం మరియు గాయాలను తొందరగా తగ్గిస్తుంది
ఎక్కువగా వాంతులతో ఇబ్బంది పడేవారు ఉత్తరేణి ఉపయోగించి వాంతులను కట్టడి చేయవచ్చు. ఇది వికారం యొక్క లక్షణాలను తక్కువ సమయంలోనే తగ్గిస్తుంది.. చర్మం తెగినపుడు మరియు, గీతలు, గాయాలపై ఉత్తరేణి ఉపయోగించడం వల్ల తొందరగా నయమవుతాయి.
ఉబ్బసం
ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచడంలో ఉత్తరేణి అద్భుతంగా పనిచేస్తుంది. ఉబ్బసాన్ని తగ్గించడంలో ఉత్తమ పలితాన్ని ఇస్తుంది. సమాన మొత్తంలో వెల్లుల్లి మరియు నల్ల మిరియాలు కలిపి పేస్ట్ గా తయారు చేసి 1/2 టీస్పూన్ రోజుకు 3 నుండి 4 సార్లు తీసుకోవాలి, ఇది జలుబు మరియు ఫ్లూ వల్ల వచ్చే జ్వరాలకు కూడా బాగా పనిచేస్తుంది.
బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకుంటే, ఉదయం మరియు సాయంత్రం ఉత్తరేణి ఘో తయారుచేసిన కషాయాన్ని తీసుకోవడం ద్వారా తొందరగా బరువు తగ్గవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్‌పై ఉత్తరేణి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొవ్వు తగ్గించడంతో పాటు చెడు కొవ్వులు పెరగకుండా చేస్తుంది.
శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
ఇది మొత్తం శరీరాన్ని సమర్థవంతంగా శుద్ధి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కఫము మరియు పిత్తము వంటి దోషాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
పైల్స్ మరియు దురద నుండి ఉపశమనం పొందండి
చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య మొలలు. ఆంగ్లంలో ఫైల్స్ గా పిలుచుక్నే ఈ సమస్యకు ఉత్తరేణి అద్భుత ఔషధం. మలబద్ధకం మరియు పైల్స్ కు దారితీసే దేహాంతర సమస్యలను తగ్గించడంలో ఉత్తరేమి పనిచేయడం వల్ల ఈ సమస్యను మూలాలతో సహా అణిచివేస్తుంది. అలాగే తేలు కాటు, దురద వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది. సమస్య ఉన్న ప్రాంతంలో ఉత్తరేణి తాజా ఆకుల రసాన్ని లేదా పేస్ట్ ను పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
టూత్ పౌడర్
ఉత్తరేణి విత్తనాలను ఉప్పుతో కలిపి పౌడర్ లా చేసుకోవచ్చు, లేదా ఉత్తరేణి పుల్లలను వేప పుల్లల్లా పళ్ళు తోమడానికి ఉపయోగించవచ్చు. దీనివల్ల పళ్ళు బలంగా, తెల్లగా, చిగుళ్లు దృడంగా తయారవుతాయి. చిగుళ్ల బలహీనత, రక్తం కారడం వంటి సమస్యలను తొందరగా తగ్గిస్తుంది.
ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది
అంటువ్యాధులను నయం చేయడానికి ఇది ఉత్తమ ఔషధం. ఇందులో గొప్ప యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చాలా ప్రభావవంతమైనవి. క్రమం తప్పకుండా ఉత్తరేణి తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
ఆకలిని నియంత్రిస్తుంది
అధిక బరువుతో ఇబ్బంది పడేవారు ఉత్తరేణిని గంజి లో జోడించిరోగికి తినడం వల్ల అధిక బరువును సులువుగా తగ్గుతారు. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా ఆహారాన్ని ఎక్కువ తీసుకునే అవసరం ఉండదు.
చివరగా……
కలుపు మొక్కగా భావించే ఈ ఉత్తరేణి లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్ కాబట్టి ఎక్కడైనా ఈ మొక్క కనబడితే అసలు వదలకండి