varicose veins natural treatment

3 సార్లు – వెరికోస్ వెయిన్స్,మీ నరాలు,సిరల్లో వాపు,బలహీనత, సమస్యను శాశ్వతంగా దూరం చేసుకొండి

చాలామందికి కాళ్ళపై నరాలు ఉబ్బి పచ్చగా కనిపిస్తుంటాయి కదా వాటినే వెరికోన్ వీన్స్ అంటారు. మన శరీరంలో నరాలది పెద్ద వ్యవస్థ. ఇవి రక్తాన్ని గుండె నుంచి వివిధ శరీరభాగాలకు సరఫరా చేస్తాయి. వీటిని ధమనులు అంటారు. ఆ శరీరభాగాలలో విడుదలయ్యే మలినాలను రక్తంతో పాటు  గుండెకు, ఊపిరితిత్తులకు తీసుకువెళ్ళే నరాలను సిరలు అంటారు.  

వీటివలనే మన శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది.  వీటిని రక్తనాళాలు అంటారు. ఈ రక్తనాళాల్లో  ఉండే కవాటాలు రక్తం గుండెకు, శరీరభాగాలకు ప్రయాణించడానికి సహాయపడతాయి. ఈ కవాటాలు బలహీనపడినా, అడ్డంకులు ఏర్పడినా రక్తం సరఫరా అవ్వదు లేదా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది.  దీనివలన సిరలు ఉబ్బి బయటకు కనిపిస్తాయి.

 ఒక్కోసారి ఈ సిరలు ఉబ్బిపోయి వాపువస్తుంది. విపరీతంగా నొప్పి కూడా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే  తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఆపరేషన్ తప్పదు అనొచ్చు. ఇవి ఎక్కువగా  కదలకుండా కూర్చునేవారికి లేదా ఎక్కువ నిలబడి పనిచేసేవారికీ వస్తుంటాయి. గర్భవతులుగా ఉన్నప్పుడు ,అధిక బరువుతో బాధపడుతున్నప్పుడు, మెనోపాజ్ సమయంలో, ఒత్తిడి మానసిక ఆందోళనలు, తగిన నీళ్ళు తాగకపోవడం, కిడ్నీ సమస్యలు  కూడా కారణం కావచ్చు. వంశపారంపర్యంగా కూడా వెరికోన్ వీన్స్ వస్తాయి.

 వెరికోన్ వీన్స్ లక్షణాలు :– నరాలు ఉబ్బడం, భరించలేని నొప్పి, శరీరంలో ఏ భాగాన్ని కదపాలన్నా నొప్పి రావడం, కుర్చొవడానికి నిల్చోడానికి ఇబ్బందిగా ఉండడం.

 వెరికోన్ వీన్స్ ప్రారంభంలో ఉంటే తగ్గడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. 

ఎండు నల్లద్రాక్ష (బ్లాక్ రెయిజిన్స్) 8, చియాసీడ్స్ ఒక స్పూన్, అవిశె గింజలు వేయించి పొడి చేసుకోవాలి. ఆ పొడి ఒక స్పూన్ తీసుకుని మూడు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి శక్తితో పాటు రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగిస్తాయి.

మసాజ్ థెరపీ :- రోజూ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వలన  నెమ్మదిగా నరాలలో ఉబ్బు తగ్గుతుంది.

రిఫండ్ ఆయిల్ తగ్గించాలి :- ఆయిల్ శరీరంలో కొవ్వును పెంచి రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పరుచుతుంది.అందుకే వీలైనంత తక్కువ ఉపయోగించాలి.

వెరికోన్ వీన్స్ కనిపించినపుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అధిక బరువు, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కొద్దిపాటి శ్రద్దతో ఆపరేషన్ వరకూ వెళ్ళకుండా వెరికోన్ వీన్స్ తగ్గించుకోవచ్చు.

1 thought on “3 సార్లు – వెరికోస్ వెయిన్స్,మీ నరాలు,సిరల్లో వాపు,బలహీనత, సమస్యను శాశ్వతంగా దూరం చేసుకొండి”

Leave a Comment

error: Content is protected !!