Vasantha Lakshmi health tips

మెంతులు చేసే మేలు మీరు ఎప్పుడు వీటి గురించి విని ఉండరు…… ఈ రహస్యాలు విని ఉండరు……..

మన వంటింట్లోనే చాలా రకాల ఔషధాలు గల వంట దినుసులు ఉన్నాయి. వాటి గురించి కొంత మందికి తెలుసు, కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమందికి అసలు తెలియదు. ఈరోజు మనం మన వంటింట్లో దొరికే ఒక మంచి సుగుణాలు ఉన్న మరియు ఎన్నో అనారోగ్యాల నుంచి ఉపశమనం అందించే ఒక దినుసు గురించి తెలుసుకుందాం. అవి మెంతులు. మెంతులు బంగారు వర్ణంలో చిన్న చిన్నగా మరియు చేదుగా ఉంటాయి. ఇవి చేదుగా ఉండటం వలన చాలామంది తినడానికి ఇష్టపడరు. మరియు వంటల్లో ఉపయోగించారు. కానీ మెంతుల్లో లో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.

వీటిలో ఖనిజాలు, లవణాలు, B2, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మరియు మనకు కావలసినంత ఫైబర్ వీటిలో ఉంటాయి. ఇటువంటి మెంతులను రోజూ ఆహారంలో చేర్చుకుంటే మనకు చాలా మంచి లాభాలు కలుగుతాయి. ఒక స్పూన్ మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి తర్వాతి రోజు ప్రొద్దున్నే ఆ నీటిని తాగడం ద్వారా మనకు మలబద్ధకం నుంచి విడుదల అనిపిస్తుంది. మరియు జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఒక హాఫ్ స్పూన్  మెంతులను నానబెట్టి పొద్దున్నే డైరెక్ట్ గా తినేస్తే డయాబెటిస్ ఉన్న వాళ్లకి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. మెంతుల్లో ఉండే గెలక్టోజ్ షుగర్ ని పెంచే బ్యాడ్ టాక్సీన్స్ ను సప్రస్ చేస్తుంది.

షుగర్ లేని వాళ్ళకి రాకుండా చేస్తుంది. ఉన్న వాళ్లకు కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి ఒక పది రోజుల పాటు ఇలా తింటే షుగర్ తగ్గిపోతుంది. మెంతులను డికాషన్ గా చేసుకొని కూడా లెమన్ మరియు తెనె కలుపుకొని తీసుకోవడం ద్వారా మన జీర్ణ శక్తి మెరుగుపడుతుంది మరియు ఫైబర్ కూడా లభిస్తుంది. మరియు మెంతులను దోరగా వేయించుకొని పోడీ చెసుకొని పెట్టుకొని ఉంటే ఎప్పుడైనా వాంతింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు ఒక హాఫ్ స్పూన్ మెంతుల పోడీ నుంచి మజ్జిగలో కలుపుకొని తీసుకోవడం ద్వారా ఆ ఫీలింగ్ నుంచి విడుదల పొందవచ్చు. మరియు విరోచనాలు అవుతున్న వాళ్లు కూడా ఈ విధంగా చేయడం ద్వారా తగ్గుతాయి.

కడుపులో మంట కూడా తగ్గుతుంది‌. మరియు పిరియడ్స్ లో వచ్చే నోప్పి నుంచి విడుదల పొందవచ్చు. రోజు ఈ మెంతిపొడిని తీసుకోవడం వలన అధిక బరువు నుంచి కూడా విడుదల పొందవచ్చు. మరియు ఈ మెంతులను నానబెట్టి పేస్ట్ చేసుకొని తలకు పట్టించడం వలన మన హెయిర్ గ్రోత్ కు బాగా ఉపయోగపడుతుంది. మరియు స్మూత్ గా తయారు అవుతుంది. ఈ మెంతులను ఉపయోగించడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి.

Leave a Comment

error: Content is protected !!