శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పూజలు, పునస్కారాలు అంటూ తీరిక లేకుండా ఉంటారు. శ్రావణ మాసం లో శివుని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతికరమైన మాసం. శ్రావణ మాసంలో శివుడిని పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. శ్రావణ మాసంలో ఈ శివుడిని పూజించడం వలన కష్టాల నుంచి బయటపడే దారి చూపిస్తాడు. శాస్త్రం ప్రకారం శ్రావణమాసంలో ఈ మొక్కలను వేయడం వలన కోటీశ్వరులు అవుతారు అని శాస్త్రంలో ఉంది.
ఏ మొక్కలను నాటడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని మొక్కలను చూడగానే ఆనందం, ఆహ్లాదం వస్తాయి. అలాగే కొన్ని మొక్కలను ఆరోగ్యపరంగా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు మనం భగవంతుని ప్రపంచంలో ఉన్నామా అనే భావన కలిగించేలా చేస్తాయి. శ్రావణ మాసంలో కొన్ని మొక్కలు నాటడం వలన ఐశ్వర్యం కలగడమే కాకుండా వాస్తు పరమైన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. శ్రావణమాసంలో తప్పకుండా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల విషయాల గురించి తెలుసుకుందాం.
వాటిలో మొదటిది బిల్వవృక్షం. బిల్వవృక్షం మన ఇంటి ఆవరణలో ఉండటం వలన చాలా మంచిది. శివునికి బిల్వవృక్షం ఆకులు అంటే చాలా ఇష్టం. బిల్వ వృక్షము యొక్క సువాసన అంటే కుబేరుడికి చాలా ఇష్టం. ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాటడం వలన సుఖసంతోషాలు కలుగుతాయి. ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. రెండవది జమ్మి మొక్క. వాస్తు శాస్త్రంలో జమ్మి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. జమ్మి ఆకులను శ్రావణ మాసంలో శివునికి నైవేద్యంగా పెడతారు. జమ్మి మొక్క ఇంటి ఆవరణలో ఉండటం వలన శని దేవుడు మీ ఇంటి చుట్టుపక్కల కూడా రాడని మన పూర్వీకుల ఆచారం. శ్రావణ మాసంలో సంపంగి మొక్క ఉండటం కూడా చాలా శ్రేష్టం. సంపంగి మొక్క ఇంటి ఆవరణలో ఉండటంవలన అదృష్టం కలుగుతుంది. సంపంగి మొక్కలు చిన్న చిన్న కుండీలలో కూడా నాటుకోవచ్చు. సంపంగి మొక్క ఇంటి ఆవరణలో ఉండటంవలన డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వృద్ధి చెందుతూనే ఉంటుంది.
నాల్గవది జిల్లేడు మొక్క. జిల్లేడు మొక్కలు చాలా రకాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో జిల్లేడు మొక్కలు నాటడం వల్ల పరమశివుని ప్రత్యేక అనుగ్రహం మనకు కలుగుతుంది. జిల్లేడు మొక్క ప్రత్యేకత ఏంటంటే సానుకూల శక్తిని ఆకర్షించడం. ఈ మొక్క మన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ మొక్క చాలా సాధారణంగా పెరుగుతుంది. దీనికి నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదు. ఐదవది ఉమ్మెత్త మొక్క. శ్రావణమాసంలో ఉమ్మెత్త మొక్క నాటడం చాలా మంచిది. ఉమ్మెత్త మొక్క నాటడం వల్ల శివుడు ప్రసన్నమై తన భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు. అంతేకాకుండా కష్టాలన్నీ తీరుస్తాడు. అంతేకాకుండా వాస్తు శాస్త్రంలో ఈ ఉమ్మెత్త మొక్క చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. శ్రావణ మాసంలో ఏ ఐదు రకాల మొక్కలు నాటడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి.