Vastu Tips For Pet Birds

మీ ఇంట్లోకి పిచ్చుకలు పదేపదే వస్తున్నాయా. దాని అర్థం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

కొన్ని సార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు, జంతువులు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియక భయపడుతూ ఉంటారు. ఈరోజు ఏ పక్షులు ఇంట్లోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట. పిచ్చుకలు జంటగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణ యోగం ఉన్నట్లు చెబుతారు. ఒకవేళ ఎవరైనా పెళ్ళి జరిగిన వారు అంటే వారికి సంతానయోగం లభించబోతుందని అర్థం. అలాగే చాలామంది కాకిని అశుభం మగా భావిస్తూ ఉంటారు. కానీ కాకి మన పితృదేవతలకు సూచనగా భావించాలి. కాకి ఎగురుకుంటూ ఇంట్లోకి వస్తే పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లు భావించాలి.

 అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కాకి తలపై తన్నితే ఏదో అశుభం జరగబోతుందని సూచన. అలాగే గుడ్లగూబని చూసి చాలా భయపడుతూ ఉంటారు. గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం ఎవరి ఇంట్లో అయినా గుడ్లగూబ వచ్చింది అంటే వారికి లక్ష్మి యోగం పట్టబోతుందని అర్థం. అలాగే కొన్ని సార్లు ఇంట్లోకి పాములు వస్తూ ఉంటాయి. ఇలా దూరడం వలన ఆ ఇంట్లో మానసిక వ్యధ వస్తుందని అర్థం. కందిరీగలు ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. ఇలా కట్టుకోవడం వల్ల ధనయోగం ఉంటుందని, ఆ గూడు కట్టిన మట్టితో బొట్టు పెట్టుకుంటే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెబుతారు. చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి. వీటిని చూసి మనం చాలా భయపడుతూ ఉంటాం .కానీ ఇవి గోడలపై ఉండే క్రిమికీటకాలను తిని మనకి మంచి చేస్తాయని చెబుతున్నారు. అలాగే వాస్తుపరంగా కూడా బల్లి ఇంట్లో ఉండటం మంచిది. 

అలాగే పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా రావడం కూడా మంచిదేనని చెబుతున్నారు. పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వస్తే మంచి జరగబోతుంది అని అర్థం గా భావించాలి. తేలు, జెర్రి ఇంట్లోకి రావడం మంచిది కాదు. ఇలా వస్తే మీ ఇంట్లో శుభ్రత లోపించిందని అనారోగ్య హేతువుగా భావించి వెంటనే ఇంటికి శుభ్రపరచాలి. అలాగే ఇంటి చుట్టు పూల మొక్కలు ఉంటే సీతాకోకచిలుకలు ఇంట్లోకి వస్తుంటాయి. సీతాకోకచిలుకలు ఇంట్లోకి రావడం వల్ల చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే లక్ష్మి యోగం పడుతుందని చెబుతున్నారు. లక్ష్మి యోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. సంతోషం, మనశ్శాంతి, సంతానం వంటివి కూడా మనిషికి కావలసినవే. ఇంట్లో సంతోషంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. ఒకరికి ఇచ్చి పొజిషన్ లో ఉన్నప్పుడు అదే నిజమైన ధనం గా భావించాలి.

Leave a Comment

error: Content is protected !!