ప్రకృతి మనకు సంపాదించిన అనేక రకాల మొక్కలోని ఔషధ గుణాలు మనకు తెలియక వాటిని వాడకుండా పక్కకు పడేస్తూ ఉంటాం. ప్రకృతి మనకు మన కోసం ఎన్నో రకాల ఔషధాలను మన కోసం దాచి పెట్టి ఉంచింది. వాటిని మనం తెలుసుకుని ప్రతి మొక్కలోని ఔషధ గుణాలను ఉపయోగించుకోగలిగితే ఆరోగ్యవంతులుగా ఉండటం అంత కష్టమేమీ కాదు. ఇంగ్లీష్ మందుల జోలికి పోకుండా ప్రకృతి వైద్యంతో ఎన్నో రకాల జబ్బులను రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాంటి మొక్కలలో ఒకటి వామింట మొక్క . ఈ మొక్కలు వర్షాకాలంలో ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ మొక్కలను పనికిరాని మొక్కలుగా భావిస్తాము. ఈ మొక్కలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ మొక్కలో ఉన్న ఔషద గుణాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు.
వామింట మొక్క ఉపయోగాలు
ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో చరకుడు చెప్పిన దాని ప్రకారం ఈ మొక్క లోని ప్రతి భాగం అనేక వ్యాధులకు వాడినట్టుగా తెలుస్తోంది. ప్రాచీన ఆయుర్వేద వైద్యులు వీటిని ఉపయోగించినట్టు గ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది. వర్షాకాలంలో వీటి ఆకులను పూర్వం రోజుల్లో కూరగా వండుకొని మన పెద్దవారు తినేవారు. ఆ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఈ మొక్కలోని ఆకులు పెంచుతాయి.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ ఆకులను ఆకు కూర వండుకుని తినడం పూర్వం రోజుల్లో పెద్దవారు చేసేవారు. ఇవి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎన్నో వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది వీటి ఆకులను శుభ్రంగా కడిగి వండుకొని తోనొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొంతమంది ఈ ఆకులను కూరగా చేసుకుని తినడం చూస్తూ ఉంటాం.

ఫోలిక్ ఆమ్లం క్యాల్షియం సోడియం ఐరన్ విటమిన్ ఎ విటమిన్ సి తో పాటు వీటి ఆకులు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉన్నాయి. వీటి ఆకులు మంచి ఆహారం. పాలిచ్చే తల్లులకు ఈ ఆకులను తినిపించడం వల్ల పాలు పడతాయి కొన్ని ప్రదేశాలలో గర్భిణిగా ఉన్నప్పుడు వాయింట మొక్క ఆకులను తినిపిస్తారు. వీటి విత్తనాల నుండి తీసిన ఆయిల్ వంటల్లో వాడుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి భారతీయ సంప్రదాయ వైద్యం తమిళ సిద్ధ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో ఈ ఆకులను విరివిగా వాడుతున్నారు.
సైనస్ మరియు తలనొప్పితో బాధపడేవారు వీటి ఆకులను సేకరించి నీటిలో బాగా మరిగించి ఆవిరిని పీలిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఆడవారిలో సంతానం కలగడంలో ఏమైనా లోపాలు ఉంటే ఈ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఆకులను బాగా శుభ్రం చేసి మూడు లేదా నాలుగు ఆకులు నమిలి తినాలి. తర్వాత ఒక గంట పాటు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా వారం రోజులు చేస్తే గర్భం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.