మెంతులు డయాబెటిస్ కి మంచి మందు అనేది ఇప్పుడు కాదు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఋషులు ఈ వాత్సవాన్ని మన సమాజానికి అందించారు. ఏ మందులు లేని రోజుల్లో మెంతులే షుగర్ వ్యాధికి మందుగా పని చేసేవి. ఋషుల మాట సైంటిఫిక్గా రుజువు అయితే ఇప్పటి రోజుల్లో కూడా ఎంతో మంది వీటిని ఉపయోగిస్తారు. మెంతులు డయాబెటిస్కి మంచి మందు అని AIMSలో పి.వి.రావ్ అండ్ డయబెటాలజిస్ట్ బృందం 2014-2015 మధ్యలో పరిశోధనలు చేసి నిరూపించింది.
మెట్ఫార్మిన్ టాబ్లెట్ డయాబెటిస్కి ఎలా పని చేస్తుందో మెంతులు కూడా అలానే పనిచేస్తాయి. మెంతులు నానబెట్టుకు తినాలా, మొలకెత్తించుకుని తినాలా, మెంతులు నీళ్లు తాగాలా లేక పౌడర్ వాడాలా అని రకరకాల సంశయాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు మెంతులు మొలకలెత్తించుకుని తింటారు కదా. అలా తినడం మంచిదేకాని చేదుగా ఉండటం వలన నోటికి రుచించవు. అందుకే ఇంకా రెండు లేక మూడు రకాల మొలకలు తిన్న తర్వాత తినడం మంచిది. మెంతులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన టైప్ 2డయాబెటిస్ కంట్రోల్లో ఉంచుతుంది. మెంతులు ఒంట్లో ఇన్సులిన్ నిరోదకతలో బాగా సహాయపడతాయి.
డయాబెటిస్ ఉన్నవారు మెంతులు మొలకెత్తించుకుని తింటే మంచిది. డయబెటిస్ లేనివారు మెంతులు తినాల్సిన అవసరం లేదు ఎందుకంటే మెంతులు ఒంటిలో షుగర్ స్థాయిని తగ్గిస్తాయి కాబట్టి డయాబెటిస్ లేనివారు మెంతులు జోలికి వెళ్లకపోవడమే మంంచిది. ఒబెసిటి ఉండి షుగర్ వచ్చే అవకాశం ఉన్నవారు తక్కువ మోతాదులో మొలకెత్తించిన మెంతులు తీసుకోవచ్చు. మెంతులు నానబెట్టుకుని తిన్నా లేక గ్రైండ్ చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగిన, పెరుగు చట్నీలో నానబెట్టిన మెంతులు కొన్ని కలుపుకుని తిన్నా, పెరుగులో నానబెట్టుకుని తిన్నా మంచిదే. రోజుకు 5గ్రాముల మెంతులు డయాబెటిస్ని కంట్రోల్లో ఉంచుతాయి కావున మెంతులు వాడుతున్నపుడు ఇంగ్లీషు మందులు వాడనవసరం లేదు.
రక్తపరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ డాక్టర్ సలహా మేరకు ఇంగ్లీషు మందుల మోతాదు తగ్గించడం మంచిది. ఇంగ్లీషు మందులు, మెంతులు ఒకేసారి వాడటం వలన లోడయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు మెంతులు దోరగా వేయించుకుని పొడి చేసుకుని మధ్యాహ్నం, రాత్రి భోజనంలో 5గ్రాముల చొప్పున వాడటం వలన షుగర్ కంట్రోల్లో ఉండి ఇంగ్లీషు మందులు వాడనవసరం లేదు. టైప్ 2షుగర్ ఉన్నవారు మెంతులు,ఇంగ్లీషు మందులు రెండు వాడటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గిస్తుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి డయాబెటిస్తో బాధపడేవారికి మెంతులు దివ్యఔషధంలా పని చేస్తాయి.