vijayadashami 2021 story in telugu

దసరా లోపు ఈ కథ వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది

దసరా పండుగ వచ్చేస్తోంది నవరాత్రులు మొదలై అప్పుడే కొన్ని రోజులు కూడా గడిచిపోయింది. రోజుకో రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ చాలామందికి దసరా యొక్క ప్రాముఖ్యత, అసలైన కథ గురించి తెలియదు. దసరా లోపు ఈ కథ విని మనస్పూర్తిగా అమ్మవారిని ప్రార్ధిస్తూ ఉంటే కోటి జన్మల పుణ్యం మీ సొంతమవుతుంది. మీరు చేసిన పాపాలు అన్ని తొలగి ముక్తిని ప్రసాదిస్తుంది ఆ తల్లి. అయితే ఆ కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి దేవతలను ఓడించాలని బాగా కోరిక అయితే దేవతల యొక్క బలం వలన వారిని ఓడించడం తన వల్ల కాలేదు. అందుకని బ్రహ్మను గూర్చి వేయి సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమనగా వేదములను నాకు వశం చేయాలి అలాగే దేవతలను గెలిచే శక్తి కావాలి అంటూ కోరుకున్నాడు. బ్రహ్మ తధాస్తు అన్నాడు. వేదాలన్నీ దుర్గముడిలో ఐక్యం అయిపోయాయి. దేవతలు శక్తిని కోల్పోయి బలహీనం అయిపోయారు. బ్రాహ్మణులకు వేదాలన్నీ మర్చిపోయారు. 

లోకంలో ఎక్కడా హోమాలు, యజ్ఞాలు లేక లోకం ధర్మ కార్యక్రమాలు చేయక, వర్షాలు లేక కరువుతో విలవిలలాడ సాగింది. అప్పుడు దేవతలు అందరూ అమ్మ వారి దగ్గరకు వెళ్లారు. ఆమెను గురించి ప్రాధేయపడగా అమ్మవారు శాకాంబరీ దేవిగా ప్రత్యక్షమయ్యారు. ఒంటినిండా కళ్ళతో, అనేక చేతులతో, చేతుల నిండా దివ్యమైన ఆహార పదార్థాలతో ప్రత్యక్షమయ్యారు. ఆ పదార్థాలను లోకంలోని జీవులన్నింటికి పంచిపెట్టారు. అమ్మవారి కంటి నుండి మూడు రోజులపాటు ఏకధాటిగా నీరు కారసాగింది. అవి నదులు చెరువులలో నిండి.కళకళలాడసాగాయి .

ఇదంతా అమ్మవారి దయ అని గ్రహించిన దుర్గముడు ఆ మెపై యుద్ధానికి వెళ్ళాడు. పదకొండు రోజులపాటు అతడితో  యుద్ధం చేసి అతడి కన్నులను పీకేసి అతడిని సంహరించింది శాఖాంబంరి దేవి. వేదాలన్నీ తిరిగి అమ్మవారి నుండి ఉద్భవించాయి. లోకంలో యజ్ఞయాగాదులు జరగడం మొదలయ్యాయి. వర్షాలు కురవడం మొదలైంది. పంటలు సమృద్ధిగా పండాయి. ప్రజలు ఆనందంగా అమ్మవారికి కృతజ్ఞతగా తొమ్మిది రోజుల పాటు పండుగను చేయడం మొదలు పెట్టారు. రోజుకో అవతారంలో అమ్మవారిని అలంకరించి నైవేద్యాలను సమర్పించారు. ఇలా అందరూ ఆనందంగా అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు.

Leave a Comment

error: Content is protected !!