ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులలో జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి మనం బయట నుండి రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఉపయోగిస్తారు. జుట్టు ఊడకుండా ఉండాలంటే ముందుగా జుట్టు రాలడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. జుట్టు రాలడానికి పై నుండి కాలుష్యం, వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు కారణమైతే లోపల నుండి జుట్టుకు కావలసిన పోషకాలు అందకపోవడం వలన కూడా జుట్టు రాలుతుంది.
ఏ చిట్కా ఉపయోగించిన జుట్టుకు కావాల్సిన పోషకాలు అందించకుండా పైన ఎన్ని చేసినా సరే ఫలితం ఉండదు. ఈ సమస్య తగ్గించుకోవడానికి మనం ముందుగా జుట్టుకు కావలసిన పోషకాలు సరైన మోతాదులో అందిస్తూ ఉండాలి. ఈ ప్యాక్ ను ఉపయోగిస్తూ జుట్టుకు కావలసిన బలాన్ని అందించే ఆహారం తీసుకున్నట్లయితే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నాలుగు లేదా ఐదు మందార ఆకులు లేదా మందార పూలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
మందార ఆకులు జుట్టురాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడతాయి. మందార ఆకులు ఉపయోగించడం వలన జుట్టు పట్టులా మెరుస్తుంది. తర్వాత నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు జుట్టుకు కావలసిన పోషకాలు అందించి జుట్టు కుదుళ్లు బలంగా చేస్తాయి. వెల్లుల్లిలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతాయి.
తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలో సల్ఫర్ ఉండడం వల్ల జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక క్లాత్లో వేసి వడకట్టుకోవాలి. వచ్చిన జ్యూస్ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
అంతేకాకుండా జుట్టుకు కావలసిన పోషకాలు కూడా అందిస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ ఈ ప్యాక్ ట్రై చేసుకుంటే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ ఉపయోగించిన తర్వాత జుట్టుకు కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జుట్టు సిల్కీగా మృదువుగా తయారవుతుంది.