మన శరీర వ్యాధి నిరోధక వ్యవస్థని చైతన్యం చేస్తూ హాని కారక వైరస్ లను మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో లో విటమిన్ సి ముఖ్య పాత్రను పోషిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్-సి ఎంతగానో సహాయపడుతుంది. విటమిన్ సి లోపం వలన చిగుళ్ల వాపు పంటి నుండి రక్తం కారడం కండరాల నొప్పి మానసిక ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి. సి విటమిన్ మన శరీరానికి సరిగా అందక పోతే రక్త నాళాలు బలహీనపడి శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా సక్రమంగా జరగదు. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అయితే సీ విటమిన్ మన శరీరం సొంతగా తయారు చేసుకోలేదు. మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే ఇది మన శరీరానికి అందుతుంది. విటమిన్ సి ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభ్యమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల ఉసిరికాయలో 900 మిల్లీ గ్రాములు సి విటమిన్ ఉంటుందంటే దీని గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని కాలాల్లో నే లభ్యమయ్యే ఉసిరిని ముక్కలుగా చేసుకుని ఎండబెట్టి భద్రపరచుకున్న దీనిలో ఉండే విటమిన్ సి అలాగే ఉంటుంది.

అలాగే మనకు నిత్యం లభించే జామకాయలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. వందగ్రాముల జామకాయలో 228 మిల్లీ గ్రాములు విటమిన్ సి లభిస్తుంది. తరచూ జామకాయను మన ఆహారంలో చేర్చుకుంటే సి విటమిన్ లోపం దరిచేరదు.
వీటితో పాటు నిమ్మ నారింజ కమలాఫలం ద్రాక్ష పైనాపిల్ బొప్పాయి మామిడి బంగాళదుంప క్యాప్సికం పాలకూర వంటి ఆహార పదార్థాలలో కూడా విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. విటమిన్ సి పిల్లలకు అయితే రోజుకి 30 నుండి 50 మిల్లీగ్రాములు అవసరమవుతుంది. పెద్దవారికి 50 నుండి అరవై మిల్లీగ్రాములు సరిపోతుంది . అలాగే గర్భిణీలకు అప్పుడే ప్రసవం అయిన వారికి 100 నుండి 120 మిల్లీగ్రాముల విటమిన్ అవసరమవుతుంది.