ముఖంపై ముడతలు మచ్చలు తగ్గడానికి విటమిన్ సి సీరం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ విటమిన్ సి సీరం తీసుకోవడం వల్ల చర్మానికి ఇంకా మంచి ఫలితం ఉంటుంది. కానీ విటమిన్ సి సీరం చాలా ఖరీదు ఉంటుంది. అందుకే ఇంట్లోనే విటమిన్ సి సీరం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఆలివ్ ఆయిల్ 200 ml బాటిల్స్ బయట మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని తెచ్చుకొని ఒక పాన్లో వేసుకోవాలి. దీనిలో తీసి పెట్టుకున్న ఆరెంజ్ తొక్కలు తీసుకోవాలి. అలాగే ఉసిరి ముక్కలను కూడా చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేసుకోవాలి. ఈ నూనె బాగా మరిగిన తరువాత రంగు మారుతుంది.
రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి నూనెను చల్లారనివ్వాలి. నూనెను ఏదైనా డార్క్ బాటిల్ లో నిల్వచేసుకోవాలి. మరియు ఎండ తగలకూడదు. విటమిన్ సి త్వరగా ఆవిరైపోతుంది. దీనిని డార్క్ గా ఉండే బాటిల్లో నిల్వ చేసుకోవడం వలన ఆరు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు.
తర్వాత ఈ నూనెను ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు శుభ్రమైన మొహంపై అంటే మేకప్ తుడిచేసి, శుభ్రంగా నీళ్లతో కడిగిన ముఖంపై అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటే ఇది చర్మంలో ఎప్పటినుండో ఉండే నల్లటి మొటిమలు, మచ్చలు, మృతకణాలను తొలగించి చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా తయారు చేస్తుంది.
ముడుతలను తగ్గిస్తుంది. కొల్లాజెన్‌ను రక్షిస్తుంది మరియు ఉత్పత్తిని పెంచుతుంది. గాయం నయం చేయడానికి సహాయపడుతుంది. ఎండ దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది. హైపర్పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. ఈవెన్గా లేని స్కిన్ టోన్ సరిచేస్తాయి. మీ చర్మ రంగును ప్రకాశవంతం చేస్తుంది. కాలుష్యం మరియు ఇతర ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా కవచం వలె పనిచేస్తుంది.
అందమైన చర్మ కాంతి కోసం ప్రతిరోజు రాత్రి ఈ నూనెతో ముఖానికి మసాజ్ చేయాలి. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ సీరం అతి తక్కువ ఖర్చుతో మీకు అందుబాటులో ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించి అందమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోండి.