Vitamin D Deficiency Hair Fall Bone Strength

ఐరన్ ఎక్కువగా వున్న ఈ పోడి నీ వాడితే రక్తమే రక్తం

స్త్రీలలో మెచ్యూర్ అయినది మొదలుకోని పిల్లలు పుట్టి అలా కొంత కాలానికి ఎగ్స్ ప్రిజర్వ్ తగ్గి ఈస్ట్రోజన్, ప్రొజోస్టిరాన్ హార్మోన్స్ విడుదల తగ్గుతుంది. నిధానంగా పీరియడ్స్ రావడం కూడా తగ్గుతుంది. ఈ దశను మెనోపాజ్ అంటారు. పుర్వ కాలంలో 50, 55 ఏళ్ళుకు  మెనోపాజ్ దశ వచ్చేది. కాలక్రమేణా ఇప్పుడు 40 ఏళ్ళకే మెనోపాజ్ దశ వస్తుంది. ఇలా పిరియడ్స్ ఆగిపోయే ముందు మూడు నాలుగు సంవత్సరాలు మరియు అగిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు మన శరీరంలో జరిగే మార్పులు మరియు అసౌకర్య పరిస్థితులను మెనోపాజ్ లక్షణాలు అంటారు.

ఈ టైం లో స్త్రీలలో హార్మోన్స్ మార్పుల వలన అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. వాటిలో లో ముఖ్యంగా మానసిక ఒత్తిడి, స్థీరంగా ఒక దాని పై నిలబడలేక పోవడం వంటి లక్షణాలు కనబడతాయి. సడన్ గా బలహీనతలు రావడం, బ్లీడింగ్స్ లో కూడా ఎక్కువగా ఇర్రెగ్యులర్టీ కనిపించడం, దీనితోపాటు ఎక్కువగా వచ్చే ఇబ్బంది ఎముకలు గుళ్ల బారటం, ఎముకల నొప్పులు ఎక్కువగా మొదలవుతాయి. వీటిని మెనోపాజ్ లక్షణాలుగా గుర్తించడం జరిగింది. మరియు బాడీ వికైపోయి విపరీతంగా చమటలు పట్టడం కూడా వీటి యొక్క లక్షణాలు.
              వీళ్లకు ఎక్కువగా విటమిన్ డి, కె మరియు యు.కె కాల్షియం, ఫాస్పరస్ కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ డి లోపం ఉంటే కాల్షియం, పాస్పరస్ అనేవి ఒంటికి పట్టవు. అదేవిధంగా విటమిన్ కె లోపం ఉంటే క్యాల్షియం పాస్పరస్ మన బోన్స్కి పట్టదు. మరియు రక్తహీనతను పోగొట్టే ఐరన్ ఎక్కువ ఉండాలి. ఇంకా మినరల్స్ ఎక్కువగా ఉండాలి. అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మరియు ఒమేగా3 ఫ్యాటియాసిడ్స్ ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ మనకు అందేటట్లు ఆహారం తీసుకోవాలి.
            దీనికోసం వ్యాయామాలు ఎక్కువగా చేయాలి. ఉదయం లేవగానే మొదట షాజీర కషాయాన్ని తీసుకోవాలి.  ఇది ఈస్ట్రోజన్ హార్మోను బాగా పెంచుతుంది. ఈ కాషాయం తీసుకున్న తర్వాత ఏడు రకాల మిక్సిడ్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ గోధుమ గడ్డి పొడి మరియు ఖర్జూరం పొడి వేసుకొని తాగితే రక్తం బాగా పెరుగుతుంది.   తర్వాత 8:30 సమయంలో మొలకలు మరియు 1 ఫ్రూట్ తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనానికి పావు గంట ముందు శతపుష్టీ ఆకు కషాయాన్ని తీసుకోవాలి. దీనితో పాటు కూరల్లో సోయాబీన్ ఉపయోగించుకోవాలి. మరియు ఆకుకూరలు తీసుకోవాలి. సాయంత్రం డిన్నర్ లో ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!