Vitamin K Rich Foods Helps for Blood Clotting

ఇది లేకపోతే బ్రతకడమే కష్టం ప్రాణాలను కాపాడే విటమిన్ ఇది…

 విటమిన్ K అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది గనక లేకపోతే బ్రతకడమే కష్టం. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనం చనిపోతాం. కాబట్టి ఈ విటమిన్ K అనేది ఎక్కడైనా దెబ్బ తగిలినా గాయాలైన రక్తం కారిపోకుండా ఒక్క నిమిషం లోపి రక్తాన్ని గడ్డ కట్టించి బ్లీడింగ్ కంట్రోల్ చేసి నెంబర్ వన్ గా పని చేస్తుంది. మరి ఈ విటమిన్ K కే అనేది రక్తం గడ్డ కట్టడానికి త్రాంబిన్ అనే ఒక ప్రోటీన్ ని రిలీజ్ చేస్తుంది. అలాగే 13 రకాల ప్రోటీన్ రక్తం గడ్డ కట్టడానికి అవసరం ఆ 13 రకాల ప్రోటీన్లు తయారీకి విటమిన్ K అనేది బాగా అవసరం. ఇది ముఖ్యంగా తీసుకున్న ఆహారంలో క్యాల్షియం ఏదైతే ఉందో దానిని పేగుల ద్వారా ఒంటికి పట్టేలా చేస్తుంది.

             1-18 మధ్య వయసు గల పిల్లలకి 30-75 మైక్రోగ్రాములు విటమిన్ K కావలి. అలాగే విటమిన్ K ఆడవారికి, గర్భిణీలకు 90 మైక్రో గ్రాములు రోజుకు కావాలి. మగవారికి 120 మైక్రో గ్రాములు ఒక రోజుకు కావాలి. ఈ విటమిన్ K అనేది బాడీ తయారు చేసుకుంటుంది. ప్రేగులలో ఉండే హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియా మనం తినే ఆహారంలో ఉండే పీచు పదార్థాలను పులవనిచ్చి దాని నుండి విటమిన్ K ని తయారు చేస్తాయి. ఈ విటమిన్ K ఫ్యాట్ సోలబుల్ విటమిన్. ఇది శరీరంలో మూడు నెలల నుండి ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది. K విటమిన్ అనేది శాకాహారములో ముఖ్యంగా ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది. మాంసాహారాల్లో తక్కువ మొత్తంలో ఉంటుంది.

            ఫ్రూట్స్ లో అవకాడో ఫ్రూట్ లో 20 మైక్రోగ్రామ్స్, కివి ఫ్రూట్ లో 40 మైక్రోగ్రామ్స్, పచ్చి బఠానీలలో 20 మైక్రోగ్రాములు, బీన్స్ లో పార్టీ మైక్రోగ్రామ్స్ ఉంటుంది. ఇక క్యాబేజీలో 100 మైక్రోగ్రామ్స్ విటమిన్ K ఉంటుంది. సోయా చిక్కుల్లో 400 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. ఇక పాలకూర తీసుకుంటే 480 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. వీటన్నింటి కంటే ఎక్కువగా విటమిన్ Kఅనేది కొత్తిమీరలో 1680 మైక్రోగ్రాములు ఉంటుంది. కొంతమందికి గుండె జబ్బులు, పక్షవాతం వచ్చినవాళ్లు రక్తం పలచబడడానికి వాడే మందులు వల్ల K విటమిన్ లోపిస్తుంది. K విటమిన్ లోపం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.

Leave a Comment

error: Content is protected !!