want to reduce weight then follow this

బరువు తగ్గాలని అనుకుంటున్నారా?? ఈ పనులు అస్సలు చేయద్దు

చాలామందిని ఆత్మన్యూనతా భావం కు గురి చేసే సమస్య అధిక బరువు. తిన్నా తినకపోయినా లావు అవుతుంటారు, ఇష్టమైన పదార్థాలను కళ్లారా చూస్తూ ఆగలేరు, తినేసాక ఎందుకు తిన్నాను అని బాధపడతారు. చాలా మంది బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలలో చాలా శాతం కాంప్రమైజ్ అవ్వడమే వారి బరువు తగ్గాలనే ప్రయత్నాన్ని నిండా ముంచేస్తుంది. మరికొందరు బరువు పెరుగుతామనే భయం తో పూర్తిగా నోరు కట్టేసుకుంటారు, ఇంకొందరు డైటింగ్ పేరుతో ఆహారాన్ని తగ్గించినా తమకు తెలియకుండానే బరువు పెంచే పదార్థాలు తినేస్తుంటారు. అందుకే బరువు తగ్గాలని అనుకునేవారి కోసం మీకోసం కొంత విషయ సేకరణ చేసాం. బరువు తగ్గాలని అనుకునేవారు ఏమి తినాలని చాలా మంది చెబుతుంటారు అయితే మొదట ఏమి తినకూడదు తెలుసుకోండి.  ఆ తరువాత వాటిని మీకు దూరంగా ఉంచుకోండి. అపుడు మీ ప్రయత్నం సరైన మార్గంలో వెళ్లి చక్కని పలితం మీ సొంతం అవుతుంది.

బరువు తగ్గడానికి తినకూడనివి

◆సాధారణంగా బరువు తగ్గాలని అనుకునేవారు దూరం గా ఉండాల్సింది కొవ్వు పదార్థాలకు. సహజ సిద్ధంగా కొవ్వులు కలిగి ఉండే పాలు, పాల పదార్థాలు అయిన పనీర్, చీజ్ వంటివి తీసుకోవడం మానేయ్యాలి. పాలతో పాటు తగిన పంచదార కూడా వేసుకుంటారు కాబట్టి పంచదార వల్ల క్యాలరీలు ఎక్కువ మన శరీరంలో చేరతాయి. అందుకే పాలు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి.

◆సాయంత్రం అవ్వగానే అలా బయటకు వెళ్తుంటే తోపుడు బండ్ల మీద మనల్ని ఆకర్షించేవి చిరుతిల్లు. మిర్చి బజ్జిలు, సమోసాలు, పాని పూరి వంటి వాటిలో ఫ్యాట్ లు అధికంగా ఉంటాయి. అందులో బయట అవి వండటానికి ఉపయోగించే నూనె చాలా సార్లు వాడి ఉండటం వల్ల  చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూ పోతుంది. ఇంకా కొన్ని పెరుగును జోడించి చేసే వాటిలో పాకెట్ పెరుగు వాడటం వల్ల అందులో రసాయన ప్రభావం అధిక బరువుకు దారి తీస్తుంది.

◆చాలా మందిలో ఉన్న అపోహ మాంసం తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది కానీ బరువు పెరగము అని. కానీ మాంసం వండటానికి ఉపయోగించే మసాలా దినుసులు, బటర్, పెరుగు వంటివి కలవడం వల్ల అందులో ఫ్యాట్ లు పెరుగుతాయి. మాంసకృత్తులు ఎక్కువగా శరీరానికి అందడం కూడా అధిక బరువుకు కారణం అవుతుంది. 

◆స్వీట్లు చాలా మందికి ఇష్టం. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ జోడించి తయారు చేసే స్వీట్లు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ గొప్ప అనుభూతిని ఇస్తాయి. అవి ఎంత తొందరగా కరిగిపోతాయో మన శరీరంలో చక్కెర స్థాయిలు అంతే తొందరగా పెరుగుతాయి. అందుకే తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా చెక్కరకు దూరంగా ఉండాలి. తీపిని తినాలని అనిపించినపుడు బెల్లం తో తయారుచేసుకుని మితంగా తినడం శ్రేయస్కరం.

బేకరీ ఫుడ్

అందరికి ఇష్టమైనది బేకరీ ఫుడ్. మైదాతో తయారయ్యే ఈ పదార్థాలు ఎంత రుచిగా ఉంటాయో అంతే చెడు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో వాడే వనస్పత్తి, కృత్రిమ రంగులు, తీపిని ఇవ్వడానికి అధిక పంచదార. రుచి కోసం కొన్ని రసాయనాలు కలిపి వీటిని తయారు చేస్తుంటారు. ముఖ్యంగా పిజ్జా లు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, డామినోస్, కెఎఫ్సిలాంటి వారు అందించే వాటిలో రుచిని చూసి కాకుండా కాస్త ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.

పప్పుధాన్యాలు

చాలామంది కేవలం బేకరీ ఆహారానికి దూరం ఉంటూ ఇంట్లో పప్పు ధాన్యాల వాడకం ఎక్కువ చేస్తుంటారు. పప్పు దాన్యాలలో పిండిపదార్థాలు శరీరంలో అధిక బరువుకు కారణం అవుతాయి. వేరుశనగ, పుట్నాల పప్పు వంటి వాటిని వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిది

కూరగాయలు

రోజు తీసుకునే కాయగూరల్లో కూడా బరువు పెరగడానికి తోడ్పడేవి ఉంటాయి. వాటిని దూరంగా ఉంచాలి. దుంపలుగా పిలుచుకునే ఆలు, చిలగడ దుంపలు మితంగా వాడాలి.  అలాగే బఠాని వంటి వాటిలో పీచు ఉన్నా మితంగా తీసుకుంటే పర్వాలేదు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందే. కాయగూరలు ఏవైనా ఉడికించి తీసుకోవడం ఉత్తమం. వేపుళ్ళుగా చేసుకోవడం వల్ల వాటిలో పోషకాలు నశించి శరీరంలో ఫ్యాట్లు పేరుకుపోతాయి.

◆డ్రై ఫ్రూట్స్ తినడానికి చాలా బాగుంటాయ్. గుప్పెడు డ్రై ఫ్రూట్స్ లోనే బోలెడు పోషకాలు ఉంటాయి. అయితే వీటిలో ఫ్యాట్లు కూడా ఎక్కువే అవడం వల్ల అపుడపుడు తీసుకుంటే పర్లేదు కానీ రెగులర్ గా వీటిని వాడటం వల్ల బరువు తగ్గాలనుకునే వారి ప్రయత్నం బెడిసికొడుతుంది

శీతలపానీయలు

బయట దొరికే కూల్ డ్రింక్స్ ఎంత రుచిగా ఉంటాయో. 100 మిల్లి లీటర్ల బాటల్ కూల్ డ్రింక్ తయారు చేయడానికి దాదాపు వంద గ్రాముల కంటే ఎక్కువ చక్కెర వాడతారు. అలాగే ఫ్లేవర్ కోసం కృత్రిమ రసాయనాలు వాడటం వల్ల కూడా విపరీతమైన బరువు పెరుగుతారు.ఇంకా బయట దొరికే ఫ్రూట్ జ్యుసులలో కూడా పండ్లలో దొరికే ఏ పోషకం కూడా లభించదు సరికదా బరువును పెంచేస్తాయ్.

చివరగా…..

బరువు తగ్గాలని అనుకున్నప్పుడు ఏమి తినాలో అన్నదే కాదు ఏమి తినకూడదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Leave a Comment

error: Content is protected !!