Warts Removing Tip

నిమ్మరసం లో ఇది ఒక్కటి కలిపి రాస్తే చాలు ఐదు సెకన్లలో పులిపిర్లు నొప్పిలేకుండా రాలిపోతాయి

ప్రస్తుతం అందరిలో సాధారణంగా కనిపించే సమస్య పులిపిర్లు. పులిపిర్లు ఎక్కువగా ఆడ వారిలో కనిపిస్తాయి.  పులిపిర్లు రావడానికి కారణం  ఒక వైరస్.పులిపిర్లు కేవలం వైరస్ వలన మాత్రమే కాకుండా ఒత్తిడి వలన, నీరసం వలన,  వ్యాధి నిరోధక శక్తి తగ్గిన,హైపర్ టెన్సన్ వలన , మానసిక ఆందోళన వలన, హార్మోన్ ఇన్ బాలన్స్ వలన, Hb లెవెల్స్ తగ్గిన కూడా పులిపిర్లు వస్తాయి.  పులిపిర్లు శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కళ్ళకింద బుగ్గలపై పెదవి కింద మెడపైన చేతుల పైన వస్తూ ఉంటాయి. 

ఇది ఉండటం వల్ల బయటికి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందువలన కొంతమంది పులిపిర్లను కాల్చడం,కత్తిరించడం వంటివి చేస్తారు. అలా చేయడం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. అందుకే ఎప్పుడూ అలాంటివి చేయకూడదు. పులిపిర్లను తొలగించాలంటే లోపలినుంచి పోయేలాగా మెడిసిన్ ఉపయోగించాలి.  పులిపిర్లు కలగడానికి కారణం అయిన వైరస్ ను తొలగించే శక్తి వెల్లుల్లికి ఉంటుంది.  వెల్లుల్లిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ వలన పులిపిర్లను మూలాల నుంచి తొలగిస్తుంది.

ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు  తీసుకుని పొట్టుతీసి మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లి బాగా దంచుకొని ఏదైనా సరైన సహాయం తో వడ కట్టుకొని జ్యూస్ తీసుకోవాలి. తర్వాత దీనిలో అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.  దీనిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా పడదు అనుకున్నవాళ్ళు  సున్నం కూడా వేసుకోవచ్చు. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లు  ఉన్న చోట  వరుసగా మూడు రోజులపాటు అప్లై చేయడం వల్ల ఎటువంటి నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోతాయి.

దీనిని ఇయర్ బడ్ లేదా టూత్ పిక్ తో స్పాట్ లాగా అప్లై చేసుకోవాలి. అంతే తప్ప మీరు సొంతంగా కాల్చడం, కత్తిరించడం, గిల్లడం వంటివి అసలు చేయకూడదు.  ఇది అప్లై చేసి ఒక  అరగంట వరకు దాన్ని ఏం చేయకుండా ఆరిపోయేంత వరకు అలా వదిలేయాలి. పులిపిరి ఉండడం వల్ల నొప్పి ఉండదు కానీ ఇరిటేషన్ చిరాకు వస్తుంది. చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వెల్లుల్లి పులిపిర్లను కలిగించే వైరస్లు మూలాలనుండి చంపి పులిపిర్లను రాలిపోయే లాగా చేస్తుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది పులిపిర్లు రాలిపోవడం ఖాయం. ఈ ఈజీ చిట్కాతో మీరు కూడా పులిపిర్లు నొప్పిలేకుండా పోగొట్టుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!