wearing-black-thread-in-leg-benefits

కాలికి నల్ల దారం ఏ రాశి వారికి కలిసివస్తుంది. ఏ రాశి వారికి అరిష్టమో తెలుసా

ఈ మధ్య అందరూ కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారు. ఒకప్పుడు చిన్న పిల్లలకు మాత్రమే దిష్టి తగలకుండా ఇలా నల్ల దారం కట్టే వారు. కానీ ఇప్పటి కాలంలో పెద్దవారు కూడా ఫ్యాషన్ పేరుతో రకరకాల పూసలతో కలిపి నల్లదారాన్ని కాలికి కట్టుకుంటున్నారు. ఇలా అందం కోసం నల్ల దారాన్ని అందరూ కట్టుకోవచ్చా? ఇలా కట్టుకోవడం వలన ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనేది చాలా మందికి తెలియకుండానే నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. అసలు నల్ల దారాన్ని దిష్టి, చెడు శక్తులు దృష్టి మనపై పడకుండా  మంచి జరగడానికి నెగిటివ్ ఎనర్జీ ని దూరంగా ఉంచడానికి కట్టుకుంటారు.

 కానీ ఇది కొన్ని రాశుల వారికి మాత్రమే మంచి చేస్తుందని, మిగతా వారికి చెడు చేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నల్ల దారాన్ని ధనుస్సు రాశి, తులారాశి,  కుంభ రాశి వారు మాత్రమే కట్టుకోవడం వలన వారికి చెడు దృష్టి నుండి ఉపశమనం లభించి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభించి ఆయురారోగ్యాలు లభిస్తాయి. వృశ్చిక రాశి, మేష రాశి వారు కట్టుకోవడం వలన మనశ్శాంతి, సంతోషం ఉండదు. ఈ రాశుల వారు అంగారకుని యొక్క అధీనంలో ఉంటారు. అంగారకుడికి నలుపంటే నచ్చదు. ఈ రాశుల వారు నల్లదారం కట్టుకోవడం వలన వీరికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెడు జరుగుతుందని చెబుతున్నారు.

 అసలు నల్ల దారాన్ని ఎప్పుడు కట్టుకోవాలి? శివుడికి నలుపు చాలా ఇష్టమైన రంగు. అలాగే శనికి కూడా నలుపు రంగు చాలా ఇష్టం. అందుకే శనివారం పూట ముందు రుద్ర గాయత్రి మంత్రం చెబుతూ ఈ నల్ల దారం కాలికి కట్టుకోవాలి. చేతికి దేవునికి సంబంధించిన పసుపుతాడు, ఎర్ర తాడు ఉన్నవారు నల్ల దారం కట్టుకోవాల్సిన అవసరం లేదు. రుద్ర గాయత్రి మంత్రం చెబుతూ ఇలా నల్ల దారం కట్టుకోవడం వలన చీడపీడల నుండి దూరంగా ఉంటారు.  శనీశ్వరుడు యొక్క  కటాక్షము లభించి కష్టాల నుండి బయటపడతారు.

Leave a Comment

error: Content is protected !!