weight loss drink to reduce weight from 100 to 70 kg

1 గ్లాసు తాగితే చాలు మీ ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది | Weight Loss Natural Remidy | Weight Loss

ప్రపంచంలో అధికబరువు సమస్యతో జనంఅందరిలోనూ సగానికి పైగా ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఈమధ్య కాలంలో ఈ సంఖ్య ఇంకా పెరిగిపోతుంది. మన శరీరంలో కొవ్వు పేరుకుపోతే మనకు తెలియకుండానే అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. మనం ఏదొక రోజు వీటి బారిన పడాల్సి వస్తుంది. 70 నుండి 80 సంవత్సరాల క్రితం సాధారణ మనిషి తన జీవితంలో ఐదునుండి ఆరు కిలోల పంచదార తినేవారు. కానీ ఇప్పుడు పంచదార క్వాలిటీ మారిపోయింది. తినే సంఖ్య మారిపోయింది. దీనివలన చాలామంది బరువు పెరిగిపోతున్నారు. బరువు ఎలా తగ్గాలి. ఎలా శరీరాన్ని డీటాక్స్ చేయాలి. మెటబాలిజం రేటు ఎలా పెంచుకోవాలో చూద్దాం. 

శరీరంలో కొవ్వు పెరగదు. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం డైట్ లేకుండానే శరీరాన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. అధికబరువు ఉన్నవారు మామూలు వారికంటే కిడ్నీ జబ్బుల ప్రమాదం ఎనభై ఐదు శాతం అధికం. డయాబెటిస్, కీళ్ళనొప్పులు, రక్తపోటు పెరగడం లేదా తగ్గడం, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. సమస్య కు తగ్గ పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. అధికబరువు పెరిగిపోతే బాడీ డీటాక్స్ చేసుకోవడం అద్భుతమైన మార్గం. మన శరీరంలో కొవ్వు పెరిగిపోతే మన శరీరం తిన్న ఆహారాన్ని పూర్తి స్థాయిలో బయటకు పంపడంలేదని అర్థం. దీనివలన ఆహారం కొవ్వు రూపంలో మారి శరీరంలో పేరుకుపోతుంది. సహజంగా ఈ టాక్సిన్లు బయటకు పంపొచ్చు. 

ఈ డ్రింక్ కోసం మనకి కావలసిన పదార్థాలు. నిమ్మకాయ తొక్కలు, దాల్చిన చెక్క, పసుపు, యాలకులు, లవంగాలు, పింక్ రాక్ సాల్ట్. ఇవన్నీ సాధారణ పదార్థాలు గా కనిపించినా వీటన్నింటిని సరైన పద్ధతిలో సరైన సమయంలో తీసుకుంటే అద్బుతమైన ఫలితాలు చూడొచ్చు. పింక్ సాల్ట్ అంటే మామూలు ఉప్పు కంటే పదిరెట్లు అధిక ఔషధగుణాలు అధికం. ఇందులో ఎనభై రకాల మినరల్స్, న్యూట్రీయంట్స్ ఉంటాయి. బాడీ డీటాక్స్ చేయడానికి, మొండికొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. ఆన్లైన్, ఆయుర్వేద షాపుల్లో సులభంగా దొరుకుతుంది. ఇది దొరకనప్పుడు నల్ల ఉప్పు, సైంధవలవణం వాడొచ్చు. పింక్ సాల్ట్ అయితే మరింత ప్రయోజనకారి. 

ఈ డ్రింక్లో పసుపు, దాల్చిన చెక్క, నిమ్మకాయ తొక్కలు చాలా ముఖ్యమైనవి. నిమ్మకాయ తొక్క లో ఉండే ఆయిల్ రసం కంటే కూడా అధికబరువు సమస్య ను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మతొక్కను గ్రేటర్ సహాయంతో తురుముకోండి. దాల్చిన చెక్క దంచి పొడిచేసుకోండి. మంటమీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళు వేసి తర్వాత అందులో రెండు నిమ్మకాయతొక్కలు లేదా  తురుము రెండు చెంచాలు వేయాలి. తర్వాత రెండు లవంగాలు వేయాలి. రెండు నిమిషాలు మరిగించాలి. తర్వాత అరచెంచా దాల్చిన చెక్క పొడి వేయాలి.మూడు చిటికెలు పసుపు, చిటికెడు పింక్ సాల్ట్ వేసి ఐదునిమిషాలు లోఫ్లేమ్ మీద మరిగించుకోండి. ఇది తయారు చేసుకునేటపుడు తప్పకుండా మూతపెట్టుకోండి. 

ఈ పదార్థాలలో ఉండే ఔషధగుణాలు నీటిలో దిగాలి. ఐదునుండి ఆరునిమిషాలు తర్వాత మంట ఆపేసి  వడకట్టుతో సహాయంతో వడకట్టాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పేరుకున్న కొవ్వు, శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. లవంగాలు, పసుపు మెటబాలిజం రేటును పెంచుతాయి. దీనివలన కొవ్వుపెరిగే రేట్ తగ్గిపోతుంది. భోజనం చేసిన గంట తర్వాత లేదా పడుకోవడానికి అరగంట ముందు తీసుకోండి. కాళీ కడుపుతో ఈ డ్రింక్ తీసుకోకూడదు.ఈ డ్రింక్ శరీరంలో వేడి కలగచేస్తుంది. కనుక ఈ డ్రింక్ చేసుకునేటపుడు అరస్పూన్ సోంపు వేసుకోవాలి.  క్రమంతప్పకుండా తీసుకుంటే చాలా త్వరగా బరువు తగ్గొచ్చు.

Leave a Comment

error: Content is protected !!