పెరిగిపోతున్న విదేశీ సంస్కృతి అలవాట్లు మన జీవితంలో పెనుమార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆహారపుటలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్లు శరీరంలో విషపదార్థాలు నింపేస్తాయి. మనం శరీరానికి సరిపడా నీళ్ళు తాగినపుడు మూత్రం, చెమట ద్వారా బయటకు వెళ్ళిపోయినా పూర్తిగా శరీరం శుభ్రపడదు. ఇంకా మిగిలిన విషపదార్థాలు శరీరంలోని అంతర్గత అవయవాలపై ప్రభావం చూపించి అనారోగ్యానికి కారణమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.
కడుపులో ఉండే అంతర్గత అవయవాలు ఈ టాక్సిన్లతో నిండిపోతాయి. వీటివలన అజీర్తి, మలబద్దకం, గ్యాస్, నిద్రలేమి కడుపుబ్బరం, చర్మంపై దద్దుర్లు, ఫైల్స్, కడుపులో అల్సర్లు, పులిపుర్లులాంటి సమస్యలు ఏర్పడతాయి. వీటిని శుభ్రపరచడానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు చూద్దాం. ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు నీటిని తీసుకుని అందులో చెంచాడు జీలకర్ర వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి టీలా తీసుకోవాలి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ,విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి.
వడకట్టిన నీటిలో చిటికెడు నల్ల ఉప్పు వేసుకోవాలి. తీయగా కావాలని అనుకున్నవారు తేనెతో తాగొచ్చు. మధుమేహం ఉన్నవారు తేనె తీసుకోకూడదు. ఈ నీటిని పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. రోజూ క్రమంతప్పకుండా ఈ నీటిని తీసుకుంటే శరీరంలో ఉండే టాక్సిన్లు, విషపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. దీనివలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తం శుభ్రపడుతుంది. రాత్రుళ్ళు ఈ నీటిని తాగడంవలన తిన్న ఆహారం జీర్ణమయి మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీలకర్రలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.
ఎనిమియాతో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తప్రసరణ పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా ఈ జీలకర్ర నీళ్ళు ఉపయోగపడతాయి. ఇందులో నిమ్మరసం కలపడంవలన మెటబాలిజం రేట్ పెరుగుతుంది. గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతుంటే వెంటనే ఈ నీటిని తాగడంవలన అద్బుతమైన రిజల్ట్స్ ఉంటాయి. దగ్గుతో బాధపడుతున్న వారు ఈ టీని తాగడంవలన ఛాతిలో కఫం కరిగిపోయి దగ్గునుండి ఉపశమనం పొందొచ్చు. దీనివలన కాలేయం మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నవైనా ఆరోగ్య రక్షణలో మేటైన జీలకర్ర నీటిని తక్కువ అంచనా వేయకుండా రోజూ తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామా మరి.
Hi
Hii nice infermation very good 9989999033 my number